మాస్ పటాకా.. మంచి ఛాన్స్ మిస్..!
అందుకే సూర్య తనకు బాగా కలిసి వచ్చిన మాస్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆల్రెడీ ఆర్జే బాలాజి డైరెక్షన్ లో సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి ఈసారి సూర్యతో కరుప్పు అంటూ ఒక మాస్ సినిమాతో వస్తున్నాడు.
By: Ramesh Boddu | 21 Oct 2025 6:35 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం కరుప్పు సినిమా పూర్తి చేసి ఆ సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఆర్జే బాలాజి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే ఈ సినిమాను దీపావళి కానుకగా తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ఎందుకో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గారు. తెలుగులో ఎలా ఉన్నా తమిళంలో దీపావళికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అక్కడ దీవాళీకి స్టార్ సినిమాలు వస్తే ఫ్యాన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు.
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ధృవ్ విక్రం బిసన్..
ముందు సూర్య కరుప్పుని దీపావళికి రిలీజ్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రెండు వారాలు పోస్ట్ పోన్ చేశారు. ఐతే ఈ దీపావళికి తమిళ్ ఆడియన్స్ కు యువ హీరోల సినిమాలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ రేసులో దిగగా చియాన్ విక్రం తనయుడు ధృవ్ విక్రం బిసన్ కూడా దీవాళీకి రిలీజ్ వచ్చింది. ఐతే ఈ రెండు సినిమాలు సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతున్నాయి. బిసన్ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేశారు. డ్యూడ్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజై సక్సెస్ అందుకుంది.
దీపావళికి సూర్య కరుప్పు వచ్చి ఉంటే కచ్చితంగా ఈ మాస్ పటాకా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ సూర్య అండ్ టీం ఆ ఛాన్స్ మిస్ అయ్యారు. సూర్య సినిమాలు ఈమధ్య ఏవి బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోవట్లేదు. కంగువ అంత భారీ బడ్జెట్ తో తీసి డిజాస్టర్ అనిపించుకున్నారు. రెట్రో అయినా ఒడ్డున పడేస్తుంది అనుకుంటే అది కూడా మిస్ ఫైర్ అయ్యింది.
సూర్య తనకు బాగా కలిసి వచ్చిన మాస్ మంత్రాన్ని..
అందుకే సూర్య తనకు బాగా కలిసి వచ్చిన మాస్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆల్రెడీ ఆర్జే బాలాజి డైరెక్షన్ లో సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి ఈసారి సూర్యతో కరుప్పు అంటూ ఒక మాస్ సినిమాతో వస్తున్నాడు. సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు సూర్య. మరి సూర్య కోరిన సక్సెస్ ఈ సినిమా అందిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఈ సినిమా తర్వాత సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. సితార బ్యానర్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై బజ్ బాగుంది. కరుప్పు హిట్ పడితే మాత్రం సూర్య నెక్స్ట్ సినిమాకు మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.
