Begin typing your search above and press return to search.

మాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్.. కరుప్పు నుంచీ సాంగ్ రిలీజ్!

తమిళ నటుడు సూర్య రెట్రో మూవీ తర్వాత ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు.

By:  Madhu Reddy   |   22 Oct 2025 2:42 PM IST
మాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్.. కరుప్పు నుంచీ సాంగ్ రిలీజ్!
X

తమిళ నటుడు సూర్య రెట్రో మూవీ తర్వాత ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సూర్య నటించిన 45వ సినిమాగా తెరకెక్కుతున్న కరుప్పు మూవీ విడుదల తేదీ గురించి నిర్మాతలు ఇప్పటివరకు అఫీషియల్ గా వెల్లడించకపోయినప్పటికీ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా కరుప్పు మూవీ నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు.. తాజాగా "గాడ్ మోడ్" అనే పాటను రిలీజ్ చేశారు.నాలుగు నిమిషాల నిడివి గల ఈ ట్రాక్ సూర్య రోల్ ని పూర్తిగా గాడ్ మోడ్ లో చూపిస్తుంది. తమిళ జానపద మతంలో ఎక్కువగా పూజించబడే పవర్ ఫుల్ దేవుడు అయినటువంటి కరుప్పు స్వామి మానవ స్వరూపంగా ఈ పాటను ప్రదర్శించారు.

తప్పు చేసిన వారికి ఈ దేవుడి పర్యవేక్షణలో స్థానం లేదు అని ఈ పాట చెబుతుంది.. ఇక ఈ పాట కోరస్ లో హీరో సూర్యను కరుప్పు స్వామి అని పిలుస్తారు.. అతని రాక ఎంతోమందికి చిరునవ్వులు తెప్పిస్తుందని, ఎంతోమంది ప్రజల హృదయాలను ప్రశాంత పరుస్తుందని ఈ పాట ద్వారా తెలిపారు.. తాజాగా విడుదలైన సూర్య కరుప్పు మూవీలోని పాట ఎంతోమంది అభిమానులను ఉత్సాహపరుస్తుంది..అలా తాజాగా విడుదలైన కరుప్పు సినిమాలోని గాడ్ మోడ్ పాటకి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు.

ఆర్జె బాలాజీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కరుప్పు మూవీకి సంబంధించిన టీజర్ ని జూన్ ప్రారంభంలో నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సూర్య బ్లాక్ కలర్ షర్ట్ , వైట్ కలర్ ధోతి ధరించి పవర్ ప్యాక్డ్ అవతారంలో కనిపించారు. అలాగే ఈ టీజర్ లో సూర్య న్యాయవాదిగా కోట్ ధరించినట్లు కూడా చూపించారు. ఇప్పటికే రెండు సినిమాలలో న్యాయవాది పాత్రలో మెరిసిన సూర్య ముచ్చటగా మూడోసారి కూడా కరుప్పు మూవీలో న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నట్టు టీజర్ ద్వారా అర్థమైంది. ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు లు నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యోగి బాబు, స్వతిక, శివదా,ఇంద్రన్స్, సుప్రీత్ రెడ్డిలు కీ రోల్స్ పోషిస్తున్నారు.ఈ సినిమాకి సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు.

అలా రెట్రో మూవీ ఫ్లాప్ తర్వాత సూర్య కరుప్పు మూవీతో మనల్ని అలరించబోతున్నారు. ఈ సినిమానే కాకుండా సూర్య , వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మమితా బైజు నటించగా.. రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.