Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో ఈసారి పాత ప‌ద్ద‌తిలోనా?

కోలీవుడ్ స్టార్ సూర్య స‌రైన స‌క్స‌స్ అందుకుని చాలా కాల‌మ‌వుతోంది. `జైభీమ్` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ ఒక్క‌టీ ప‌డ‌లేదు.

By:  Srikanth Kontham   |   25 Nov 2025 11:23 AM IST
ఆ స్టార్ హీరో ఈసారి పాత ప‌ద్ద‌తిలోనా?
X

కోలీవుడ్ స్టార్ సూర్య స‌రైన స‌క్స‌స్ అందుకుని చాలా కాల‌మ‌వుతోంది. `జైభీమ్` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ ఒక్క‌టీ ప‌డ‌లేదు. `జైభీమ్` కూడా ఓటీటీ రిలీజ్ కావ‌డంతో ? థియేట్రిక‌ల్ గా ఆడియ‌న్స్ దూరంగానే క‌నిపించింది. కానీ ఆ సినిమాతో సుర్య‌కు వ‌చ్చిన గుర్తింపు మాత్రం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రిలీజ్ అయిన నాలుగైదు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ప్ర‌త్యేకించి ఆ సినిమా రిలీజ్ లు కూడా అన్నీ త‌మిళ టైటిల్స్ తో తెలుగు లో రిలీజ్ అయ్యాయి. టైటిల్ మార్చిల్సిన ఆవ‌శ్య‌క‌త లేక‌పోవ‌డంతో అదే టైటిల్ తో ఏక కాలంలో రిలీజ్ చేసారు.

తెలుగులో త‌మిళ టైటిల్స్ వాస‌న‌:

`ఈటీ`, `కంగువ‌`, `రెట్రో` లాంటి చిత్రాల టైటిల్స్ లో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తెలుగు టైటిల్ లేకుండా త‌మిళ సినిమా రిలీజ్ ఏంట‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్య‌యాయి. అంత‌కు ముందు మ‌రికొంత మంది హీరోలు న‌టించిన సినిమాలు కూడా ఇలాగే రిలీజ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ నుంచి కాస్త నెగివిటీ కూడా మొద‌లైంది. కానీ తెలుగు అభిమానులంటే సూర్య ఎంతో గౌర‌విస్తారు. ఆయ‌న్ని ఇక్క‌డ ఆడియ‌న్స్ ఎంతో ఆద‌రిస్తారు. త‌మిళ‌ అభిమానుల కంటే త‌నకు ఓ మెట్టు పైనే తెలుగు అభిమానులుంటారు. సూర్య లాగే కార్తీ కూడా ఇక్క‌డ అభిమానుల‌కు అంతే ప్రాధాన్య‌త ఇస్తారు.

పోటీ కూడా అడ్డంకిగా:

త‌మిళ నుంచి ఎంత మంది హీరోలున్నా? అన్న‌ద‌మ్ములిద్ద‌రు మాత్రం తెలుగు ఆడియ‌న్స్ కు ఎంతో ప్ర‌త్యేకం. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే త‌దుప‌రి సినిమా రిలీజ్ విష‌యంలో సూర్య సంచ‌ల‌న నిర్ణ‌యానికి అవ‌కాశం ఉందా? అంటే ఉంద‌నే చ‌ప్పొచ్చు. సూర్య న‌టించిన `క‌రుప్పు` సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఆ సీజ‌న్ లో త‌మిళ స‌హా తెలుగు నుంచి చాలా సినిమాలు రిలీజ్ కు ఉండ‌టంతో? సూర్య ఉన్న తాజా ప‌రిస్థితుల్లో వాళ్ల‌కు పోటీగా రావ‌డం కంటే పోటీ లేని స‌మ‌యంలోనే వ‌స్తే బాగుంటుంది అన్న ఆలోచ‌న‌తో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలిసింది.

గ‌త సినిమాల వైఫ‌ల్యం నేప‌థ్యంలో:

ఈ నేప‌థ్యంలో రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26` క‌రుప్పు` ను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారుట‌. అయితే ఈ సినిమాకు తెలుగు లో టైటిల్ ఉండాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతుంది. సూర్య గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు అభిమానుల కోసం తెలుగు టైటిల్ తో రావాల‌ని ఆశీస్తున్నారు. అందుకు సూర్య ఎంత మాత్రం అడ్డు చెప్పే న టుడు కాదు. గ‌త సినిమాల వైఫల్యం నేప‌థ్యంలో ఈసారి తెలుగు టైటిల్ తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌ధ్య‌లో ద‌ర్శ‌క , నిర్మాత‌లు మాతృభాష‌పై అతి మ‌మ‌కారంతో ఎలాంటి రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌కుండా ఉంటే సాధ్య‌మే.