Begin typing your search above and press return to search.

2026 అయినా సూర్య‌కు క‌లిసొచ్చేనా?

అందుకే సూర్య నటించే సినిమా కోసం త‌మిళ‌నాడు ప్రేక్ష‌కులతో పాటు ఇటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తారు.

By:  Sivaji Kontham   |   20 Dec 2025 8:00 AM IST
2026 అయినా సూర్య‌కు క‌లిసొచ్చేనా?
X

సౌత్ స్టార్ హీరో సూర్య వెర్స‌టైలిటీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సింగం ఫ్రాంఛైజీ కాప్ పాత్ర‌లో న‌టించినా, శివ‌పుత్రుడులో గార‌డీ వాడిగా క‌నిపించినా, సెవెంథ్ సెన్స్ లో స‌ర్క‌స్ వాలాగా, బ్ర‌ద‌ర్స్ లో అవిభాజ్య క‌వ‌ల సోద‌రులుగా న‌టించినా, కెరీర్ లో సూర్య చేయ‌ని ప్ర‌యోగం లేదు. న‌టించిన ప్ర‌తి సినిమాలోను ఏదో ఒక కొత్త‌ద‌నం కోసం త‌పించాడు. గాయం కార‌ణంగా మ‌తిమ‌రుపుతో జీవించేవాడిగా `గ‌జినీ`లో అత‌డి న‌ట‌న‌ను అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ లాంటి చిత్రాల‌లోను అత‌డి ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించారు.

అందుకే సూర్య నటించే సినిమా కోసం త‌మిళ‌నాడు ప్రేక్ష‌కులతో పాటు ఇటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. సౌత్ అంత‌టా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అత‌డు. అయితే సూర్య‌కు ఇటీవ‌ల కొన్నేళ్లుగా స‌రిగా క‌లిసి రావ‌డం లేదు. క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించిన రేంజ్ బాక్సాఫీస్ హిట్లు ద‌క్క‌లేదు. సాటి హీరోలు 500 కోట్ల క్ల‌బ్, 800 కోట్ల క్ల‌బ్, 1000 కోట్ల క్ల‌బ్ అంటూ దూసుకుపోతుంటే సూర్య మాత్రం రేసులో వెన‌క‌బ‌డ్డాడు. ర‌జ‌నీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్, త‌ళా అజిత్ లాంటి స్టార్లు ఉన్న ప‌రిశ్ర‌మ‌లో సూర్య కూడా త‌న ప్రత్యేక‌త‌ను నిల‌బెట్టుకుంటూ ముందుకు వెళుతున్నా, ఇక్క‌డ క‌మ‌ర్షియ‌ల్ గా క‌లెక్ష‌న్ల సునామీ అవ‌స‌రం. ఇటీవ‌ల పాన్ ఇండియాలో చాలా మంది స్టార్లు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో త‌మ స్థానాన్ని మెరుగుప‌రుచుకుంటున్నారు. అందుకే సూర్యకు ఇప్పుడు స‌రైన పాన్ ఇండియా రీచ్ అవ‌స‌రం.

అయితే అత‌డు క‌ష్ట‌కాలం నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి? అన్న‌దే చిక్కు ప్ర‌శ్న‌. సౌత్ అగ్ర హీరోల‌లో ఒక‌రిగా ఉన్న సూర్య కెరీర్ ఎందుక‌నో ఆశించిన హైట్స్ కి చేరడం లేదు. ముఖ్యంగా ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ త‌ర్వాత స‌రైన హిట్టు లేదు.. వ‌రుస‌గా స‌ర్ఫిరా, కంగువ‌, రెట్రో .. ఏవీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు..మార్కెట్ ప‌రంగా పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉన్నాడు సూర్య‌. ముఖ్యంగా కంగువ లాంటి భారీ యాక్ష‌న్ చిత్రం ఫెయిల‌వ్వ‌డం సూర్య‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇటీవ‌లి స‌న్నివేశం చూస్తే, ఒక్క‌ కోలీవుడ్ మిన‌హా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌లో అత‌డి సినిమాల‌కు మార్కెట్ చాలా వ‌ర‌కూ త‌గ్గిపోయింది.అయితే సూర్య కెరీర్ తిరిగి పుంజుకోవాలంటే, 2026లో అత‌డు కంటెంట్ తో దూసుకు రావాల్సి ఉంది.

కొత్త సంవ‌త్స‌రంలో సూర్య న‌టించిన `క‌రుప్పు` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాపైనే సూర్య ఆశ‌లు..కరుప్పు (నలుపు) భారీ యాక్షన్ డ్రామా చిత్రం. దీనికి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. అశ్విన్ రవిచంద్రన్, రాహుల్ రాజ్, టి. ఎస్. గోపి కృష్ణన్, కరణ్ అరవింద్ కుమార్‌లతో కలిసి ఆర్జే బాలాజీ క‌థ‌ను రాశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్య -త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుద‌ల కోసం సూర్య ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. భారీ యాక్ష‌న్ చిత్రంలో ర‌క‌రకాల షేడ్స్ ఉన్న పాత్ర‌లో సూర్య న‌ట‌విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌నున్నాడ‌ని ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ చెబుతోంది. క‌రుప్పు రిలీజ్ తేదీని ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇక సూర్య 46, సూర్య 47 సెట్స్ పై ఉన్నాయి. వాటికి సంబంధించిన అధికారిక అప్ డేట్ అందాల్సి ఉంది.