టాలీవుడ్ లో బ్రదర్స్ మల్టీస్టారర్ ప్లాన్ !
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అభిమాన గణాన్న సంపాదించుకున్న స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ. ఇద్దరు విడివిడిగా టాలీవుడ్ లో ఎన్నో డబ్బింగ్ చిత్రాలతో సూపర్హిట్లను ఖాతాలో వేసుకున్నారు.
By: Srikanth Kontham | 22 Oct 2026 7:00 PM ISTకోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అభిమాన గణాన్న సంపాదించుకున్న స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ. ఇద్దరు విడివిడిగా టాలీవుడ్ లో ఎన్నో డబ్బింగ్ చిత్రాలతో సూపర్హిట్లను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమాలో చూడాలని చాలా కాలంగా తెలుగు, తమిళ సినీప్రియులు కోరు కుంటున్నారు. ఇప్పుడా కల నెరవేరే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సూర్య, కార్తీ కాంబినేషన్లో ఓ గ్రాండ్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి కేవలం తమిళానికే పరిమితం కాకుండా పాన్-ఇండియా రేంజ్లో తెలుగులోనూ భారీగా ప్లాన్ చేస్తున్నారట.
దీనికోసం టాలీవుడ్‌కు చెందిన కొందరు క్రేజీ దర్శకులతో చర్చలు కూడా మొదలైనట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్ సమపాళ్లలో కుదిరే సరైన స్క్రిప్ట్ కోసం ఇద్దరు వేట ప్రారంభించారని.. ఒకరిద్దరు స్టార్ డైరెక్టర్లు చెప్పిన లైన్లకు ప్రాథమికంగా మొగ్గు చూపారని సమాచారం. గతంలో సూర్య నటించిన `విక్రమ్` సినిమాలో కార్తీ పాత్ర `రోలెక్స్` అప్పీరియెన్స్ను గుర్తుచేస్తూ చిన్న లింక్ ఇచ్చినా? అది పూర్తిస్థాయి మల్టీస్టారర్ కాదు. కానీ ఈసారి రాబోయే ప్రాజెక్ట్‌లో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న పవర్ఫుల్ రోల్స్ డిజైన్ చేస్తున్నారని టాక్. అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధం లేదా వారిద్దరి మధ్య జరిగే పవర్ఫుల్ మైండ్ గేమ్ నేపథ్యంలో కథ నడిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
తెలుగు దర్శకులు మల్టీస్టారర్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో దిట్టలు. ఇటీవల కాలంలో టాలీవుడ్లో వచ్చిన భారీ మల్టీస్టారర్ల విజయాలు చూసాక.. తమిళ స్టార్స్ సైతం తెలుగు మేకర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కార్తీ ఇప్పటికే నాగార్జునతో `ఊపిరి` వంటి మల్టీస్టారర్ చేసి తెలుగులో మార్కెట్‌ను మరింత బలపరుచుకున్నారు. అలాగే సూర్యకు కూడా టాలీవుడ్లో ఓపెనింగ్స్ పరంగా భారీ మార్కెట్ ఉంది. ఇటీవలే విడుదలైన విశ్వనాఃద్ అండ్ సన్స తో సూర్య నేరుగా టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి ఫలితాన్నిచ్చింది. దీంతో బ్రదర్స్ కాంబోలో సినిమా వస్తే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం.
ఈ భారీ కాంబినేషన్‌ను ఏ బడా ప్రొడక్షన్ హౌస్ టేకాఫ్ చేయబోతోంది? ఏ దర్శకుడు అన్నదమ్ములను ఒకే తెరపై చూపించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోబోతున్నాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇద్దరూ వ్యక్తిగత కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నా? ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ సజావుగా సాగితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏది ఏమైనా? సూర్య - కార్తీ కాంబినేషన్లో టాలీవుడ్ మల్టీస్టారర్ తెరకెక్కితే అది సౌత్ ఇండియా సినిమాలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్‌గా మారనుంది. అన్నదమ్ముల మాస్ అండ్ క్లాస్ కాంబో వెండితెరపై ఎలా అదరగొడుతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
