Begin typing your search above and press return to search.

రూమ‌ర్‌ల‌ని నిజం చేస్తున్న‌ సూర్య ఫాద‌ర్‌!

అయితే తాజాగా సూర్య ఫాద‌ర్ శివ‌కుమార్ చేసిన కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ఆయ‌న ఓ మీడియాతో మాట్లాడుతూ సూర్య‌, జ్యోతిక‌ల ల‌వ్ మ్యారేజ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Entertainment Desk   |   14 Feb 2026 4:00 PM IST
రూమ‌ర్‌ల‌ని నిజం చేస్తున్న‌ సూర్య ఫాద‌ర్‌!
X

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలోని క్రేజీ జోడీల్లో సూర్య‌, జ్యోతిక జంట ఒక‌రు. సినిమా కార్య‌క్ర‌మాల్లో అయినా,వ్య‌క్తిగ‌త వేడుక‌ల్లో అయినా వీరిద్ద‌రు ఎప్పుడూ జంట‌గానే క‌నిపించ‌డం ప్ర‌తీ ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటోంది. చూడ‌ముచ్చ‌టైన జంట‌గా ప్ర‌ముఖ‌ల‌తో పాటు సినీ వ‌ర్గాలు, అభిమానులు అభివ‌ర్ణిస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ క్రేజీ జోడీ ఒక‌రి కోస‌మే ఒక‌రు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ గ‌త కొన్నేళ్లుగా త‌మ వైవాహిక జీవితాన్ని సాగిస్తున్నారు. జ్యోతిక విష్‌ని గ‌మ‌నించిన సూర్య త‌ను న‌టిస్తుండ‌గా, జ్యోతికి న‌ట‌కు దూరం కావ‌డం ఏంట‌ని త‌న‌ని కూడా న‌టించ‌డం స్టార్ట్ చేయించాడు.

ఇదే సూర్య ఫ్యామిలీలో తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌కు దారి తీసింద‌ని, దాని కార‌ణంగానే ఇద్ద‌రూ ఫ్యామిలీని ముంబ‌యికి షిఫ్ట్ చేశార‌ని, ప్ర‌స్తుతం సూర్య, జ్యోతిక పిల్ల‌ల‌తో క‌లిసి అక్క‌డే ఉంటున్నార‌ని, ప్ర‌త్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నార‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. సూర్య ఫ్యామిలీలో వివాదం గురించి ప‌క్క‌న పెడితే గ‌త కొంత కాలంగా సూర్య‌, జ్యోతిక మాత్రం ముంబ‌యిలో ఉంటున్నారు. అక్క‌డే స‌క‌ల సౌక‌ర్య‌లు గ‌ల ఓ భ‌వంతిని కొని అందులోనే ఉంటున్నారు. కానీ ఏ రోజు కూడా ఫ్యామిలీలో త‌లెత్తిన మ‌న‌స్ప‌ర్థ‌లు, వివాదాల గురించి సూర్య‌, జ్యోతిక బ‌య‌ట‌పెట్ట‌లేదు.

అయితే తాజాగా సూర్య ఫాద‌ర్ శివ‌కుమార్ చేసిన కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ఆయ‌న ఓ మీడియాతో మాట్లాడుతూ సూర్య‌, జ్యోతిక‌ల ల‌వ్ మ్యారేజ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తాను మొద‌ట వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌న్నారు. కానీ సూర్య ప‌ట్టుప‌ట్ట‌డంతో అంగీక‌రించాన‌ని తెలిపారు. `సూర్య ముందు త‌న ప్రేమ గురించి చెప్ప‌గానే కుద‌ర‌ద‌న్నాను. జ్యోతికతో మాత్ర‌మే జీవితాన్ని పంచుకుంటాన‌ని త‌ను మొండిప‌ట్టుప‌ట్టాడు. లేదంటే జీవితాంతం ఒంట‌రిగా ఉంటాన‌న్నాడు.

అలా అన్న వెంట‌నే నా కెరీర్‌లో నేను న‌టించిన 150 ప్రేమ‌క‌థ‌లు నాకు గుర్తొచ్చాయి. దీంతో అంగీక‌రించాను` అన్నారు శివ‌కుమార్‌. అయితే సూర్య మొద‌ట్లో బిడిమంగా ఉండేవాడ‌ని, జ్యోతికి త‌న జీవితంలోకి వ‌చ్చాక చాలా మార్పులు వ‌చ్చాయ‌ని, ఒక‌ప్పుడు మౌనంగా ఏమీ మాట్లాడ‌ని కుర్రాడేనా ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌ల‌ని చూసుకుంటున్నాడు అనిపిస్తోంద‌ని చెప్పారు. అయితే సూర్య‌, జ్యోతిక‌ల ప్రేమ వివాహం ముందు నుంచి శివ కుమార్‌కు ఇష్టం లేద‌ని త‌మిళ నాట ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది.

ఆ త‌రువాత జ్యోతిక సినిమాల్లో మ‌ళ్లీ న‌టించ‌డం కూడా ఆయ‌న‌కు పెద్ద‌గా ఇష్టం లేద‌ని, ఆ కార‌ణం వ‌ల్లే సూర్య త‌న ఫ్యామిలీకి దూరంగా ముంబ‌యిలో జ్యోతిక, పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్నాడ‌ని వార్త‌లు షికారు చేశాయి. శివ‌కుమార్ తాజా స్టేట్మెంట్‌తో గ‌తంలో వ‌చ్చిన‌వి రూమ‌ర్‌లు కాద‌ని, అందులో నిజం ఉంద‌ని తేల‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం సూర్య తెలుగు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న మూవీతో పాటు ఆర్‌.జె. బాలాజీ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన `క‌రుప్పు`లో న‌టిస్తున్నాడు. ఇవి రెండూ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.