Valentine’s Day Special: జ్యోతిక ప్రేమ కోసం సూర్య చేసిన పోరాటం..!
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్నా కానీ.. కొంతమంది మాత్రం అభిమానుల్లో ఎప్పటికీ బెస్ట్ జంటగా నిలిచిపోతుంటారు.
By: Priya Chowdhary Nuthalapti | 14 Feb 2026 5:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్నా కానీ.. కొంతమంది మాత్రం అభిమానుల్లో ఎప్పటికీ బెస్ట్ జంటగా నిలిచిపోతుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు సూర్య - జ్యోతిక.. వాలెంటైన్స్ డే వేళ, సెలబ్రిటీ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో సూర్య–జ్యోతిక ప్రేమ కథ అభిమానులకు మరింత స్పూర్తిని ఇస్తోంది.
సూర్య, జ్యోతిక కలిసి సినిమాల్లో పని చేసే సమయంలో మొదట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆ తరువాత..క్రమంగా స్నేహంగా మారింది. షూటింగ్ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్నేహమే మెల్లగా ప్రేమగా మారింది. అయితే వాళ్ల ప్రేమకి మనందరం అనుకుందంట ఈజీగా శుభం కార్డు అయితే పడలేదు.
ఈ ప్రేమకు మొదట్లో కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. ముఖ్యంగా సూర్య తండ్రి శివకుమార్.. కొంతకాలం ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోయారట. తండ్రిగా ఆయనకు కొన్ని ఆందోళనలు ఉండేవంట. సినిమా రంగంలో ప్రేమ పెళ్లిళ్లు నిలబడతాయా అనే సందేహం కూడా ఆయనకు కలిగిందట. అందుకే వెంటనే పెళ్లికి ఓకే చెప్పలేకపోయారు.
అయితే సూర్య మాత్రం తన నిర్ణయంలో చాలా స్పష్టంగా ఉన్నాడంట. జ్యోతికనే పెళ్లి చేసుకుంటానని, అది కుదరకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోనని తండ్రికి చెప్పాడట. ఈ మాటల్లో సూర్య ప్రేమ ఎంత బలమైనదో ఆయనకి అర్థమైంది. తన భావాలను నేరుగా చెప్పడం వల్ల తండ్రి కూడా ఆలోచనలో పడ్డారట.
ఇదే విషయాన్ని శివకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. సూర్య అలా చెప్పిన తరువాత తను కూడా ఒక విషయం ఒక విషయం గుర్తు చేసుకున్నానని.. వందల సినిమాల్లో నటించానని, వాటిలో చాలా సినిమాల్లో ప్రేమ పెళ్లులే అని తను గుర్తు చేసుకున్నట్లు తెలిపాడు..’సినిమాల్లో ప్రేమను సమర్థించిన నేను, నిజ జీవితంలో నా కొడుకు ప్రేమను ఎందుకు అడ్డుకోవాలి? అనే ఆలోచన నా మనసుని పూర్తిగా మార్చేసింది,” అని చెప్పుకొచ్చారు. ఆ ఆలోచనతో చివరకు సూర్య–జ్యోతిక పెళ్లికి ఆశీర్వాదం ఇచ్చారంట.
వివాహం తర్వాత సూర్య, జ్యోతిక కలిసి ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. ఇద్దరూ ఒకరికి ఒకరు బలంగా నిలిచారు. ఈ రోజు వారు ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. వారి ప్రేమ కథ నిజమైన ప్రేమకు, ధైర్యానికి, ఓర్పుకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
