Begin typing your search above and press return to search.

నా 20 ఏళ్ల కల నెరవేరింది.. ఈ క్యూట్ ఫొటోస్ చూశారా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఐకోనిక్ కపుల్'గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటులు సూర్య - జ్యోతిక, తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

By:  Madhu Reddy   |   16 Sept 2026 3:15 PM IST
నా 20 ఏళ్ల కల నెరవేరింది.. ఈ క్యూట్ ఫొటోస్ చూశారా?
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఐకోనిక్ కపుల్'గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటులు సూర్య - జ్యోతిక, తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. రెండు దశాబ్దాల అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా, కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయ మిత్రుల సమక్షంలో చర్చిలో వీరు మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ఈ స్పెషల్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..





వైట్ వెడ్డింగ్ డ్రెస్‌లో దేవకన్యలా జ్యోతిక :

ఈ రీ-వెడ్డింగ్ వేడుక కోసం జ్యోతిక మెరిసే తెల్లటి స్ట్రాప్‌లెస్ బ్రైడల్ గౌనును ధరించి పాలరాతి శిల్పంలా కనిపించింది. ప్రముఖ స్టైలిస్ట్ రాధికా మెహ్రా డిజైన్ చేసిన ఈ సీక్విన్స్ డ్రెస్‌లో ఆమె ఎంతో రాయల్‌గా మెరిసిపోయింది. ఇక హీరో సూర్య వైట్ టక్సేడో జాకెట్, దానికి మ్యాచింగ్ ఫ్లోరల్ బొటోనియర్, బ్లాక్ ఫార్మల్ ట్రౌజర్స్ ధరించి అత్యంత హ్యాండ్‌సమ్‌గా కనిపించాడు. చర్చిలోకి జ్యోతిక అడుగుపెడుతున్న క్షణాల్లో సూర్య ,కార్తీ ,వాళ్ళ పిల్లలు అందరు ఆయనకు విషెస్ చెప్తూ హంగామా చేయటం చూడచ్చు..





"ఒకరికోసం మరొకరు మారిన బంధం" అంటూ భావోద్వేగం:

ఈ వేడుక వీడియోను పంచుకుంటూ జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. "త్యాగాలు, సర్దుబాట్లు, నిస్వార్థంగా ప్రేమించుకునేందుకు ఒకరికోసం మరొకరు మారిన వ్యక్తిత్వాలకు ప్రతీకగా చేసుకునే వేడుక ఇది. మనం ప్రేమించే వ్యక్తి తనకంటే ఎక్కువగా మనల్ని గౌరవించినప్పుడు జీవితం ఓ గొప్ప బహుమతి" అని సూర్యపై ప్రేమను కురిపించింది. తమ డ్రీమ్‌ని నిజం చేసిన ఫ్రెండ్స్, డిజైనర్లు మరియు ఈవెంట్ కోఆర్డినేటర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.





'పూవెల్లామ్ కేట్టుప్పార్' నుంచి ప్రారంభమైన ప్రేమ :

1999లో వచ్చిన 'పూవెల్లామ్ కేట్టుప్పార్' సినిమా షూటింగ్ సమయంలో సూర్య-జ్యోతికల మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో 2006 సెప్టెంబర్ 11న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు 2026లో తమ 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ మరుపురాని వేడుకను చేసుకున్నారు.





అభిమానుల శుభాకాంక్షల వర్షం:

ఉంగరాలు మార్చుకుని కొత్త వాగ్దానాలు చేసుకున్న ఈ లవ్లీ కపుల్‌పై బంధుమిత్రులు పూలవర్షం కురిపించారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు "పర్ఫెక్ట్ జోడీ", "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఈ ఐకోనిక్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రెండు దశాబ్దాలుగా ప్రేమ, గౌరవంతో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఆదర్శంగా జీవిస్తున్న సూర్య-జ్యోతిక దంపతులు, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నూరేళ్ల పాటు సంతోషంగా కలిసి ఉండాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.