మళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య!
కంగువ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్త పడిన సూర్యకు వరుస విజయాలు దక్కుతున్నాయి. కరుప్పు, తెలుగు చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్, తాజాగా సీన్ విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు. దీంతో సూర్య మార్కెట్ మళ్లీ పుంజుకోగా, జ్ఞాన్‌వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 18వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Srikanth Kontham | 9 Nov 2026 12:11 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య `జై భీమ్` తర్వాత నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రయత్నంలో భాగంగా ఎంతో ఎఫెర్ట్ తో `కంగువ` చేసారు. కానీ ఆ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. దీంతో అప్పటి నుంచి పాన్ ఇండియా అనే ఆలోచనే రాకుండా పని చేస్తున్నారు. రీజనల్ మార్కెట్ ఆధా రంగానే కథలను ఎంచుకుంటున్నారు. అయితే ఈ ఐడియా సూర్యకు బాగానే వర్కౌట్ అయింది. పడిపోయిన మార్కెట్ ను మళ్లీ హైకి చేరుతుంది. `కంగువ` తర్వాత నటించిన `రెట్రో` ప్లాప్ అయినా? ఆ తర్వాత మళ్లీ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటున్నారు.
సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ `కరుప్పు` మంచి విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో సూర్యకు భారీ ఊరట దక్కింది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన సక్సెస్ కావడంతో? సూర్యకు ఈ చిత్రం మంచి బూస్టింగ్ ను అందించింది. సరిగ్గా ఇదే సమయంలో సూర్య నేరుగా తెలుగు సినిమా చేసారు. అదే `విశ్వనాధ్ అండ్ సన్స్`. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మంచి విజయం సాధించింది.
స్టోరీ పరంగా రిస్క్ తీసుకోకుండా సూర్య సేఫ్ జోన్ లో కుటుంబ కథా చిత్రంలో నటించి తెలుగు ఆడియన్స్ కు మరింత రీచ్ అయ్యారు. ఈ సినిమా 200 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. ఆ రకంగా సూర్య తొలి తెలుగు చిత్రం గ్రాండ్ విక్టరీ అందుకున్నట్లే. ఈ విజయంతో సూర్య ఇకపై నేరుగా సినిమాలు చేయోచ్చు అన్న ధీమా కలిగింది. ఇదే ఉత్సాహంలో తాజాగా రిలీజ్ అయిన తమిళ చిత్రం `సీన్` కూడా మంచి విజయం సాధించింది. తమిళ్ లో జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ సినిమాకు తెలుగు నుంచి మంచి రివ్యూలు వచ్చాయి.
వసూళ్ల పరంగానూ పర్వాలేదనిపించింది. ఈ విజయంతో సూర్య కెరీర్ లో హ్యాట్రిక్ నమోదు అయింది. దీంతో సూర్య ఇకపై రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసే అవకాశం ఉంది. `కంగువ` ప్లాప్ తో కథల విషయంలో అలెర్ట్ అయిన హీరో? మళ్లీ దుకుడు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే సూర్య కొన్ని కథలు కమిట్ అయ్యారు. ప్రస్తుతం సూర్య 18వ చిత్రానికి జ్ఞాన్ వేల్ దర్శకత్వం వహిస్తున్నారు. `జైభీమ్` తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రెండవ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోసారి ఇద్దరు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని అభిమానులు ఆశీస్తున్నారు.
