Begin typing your search above and press return to search.

కంబ్యాక్ హిట్ తర్వాత సూర్య ఎమోష‌న‌ల్ డెసిష‌న్

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో కరుప్పు సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Jun 2026 11:56 AM IST
కంబ్యాక్ హిట్ తర్వాత సూర్య ఎమోష‌న‌ల్ డెసిష‌న్
X

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో కరుప్పు సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. గత కొన్నేళ్లుగా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోవడానికి ఎదురుచూస్తున్న సూర్యకు ఈ సిన‌మా నిజమైన కంబ్యాక్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ ముందే అనేక అంచనాలు నెలకొల్పిన కరుప్పు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో పాటు సూర్య అభిమానులకు కూడా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఆనందాన్ని అందించింది. ఈ విజయంతో సూర్య మళ్లీ తన స్టార్‌డమ్‌ను నిరూపించుకోవడమే కాకుండా, తన టీమ్ పట్ల ఉన్న గౌరవాన్ని కూడా ప్రత్యేకంగా చాటుకున్నారు.





క‌ర‌ప్పు జ‌ర్నీ స‌క్సెస్‌ఫుల్ గా కనిపించినప్పటికీ, సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రిలీజ్ ప్రక్రియలో ఏర్పడిన ఫైనాన్షియల్ అడ్డంకులను సూర్య స్వయంగా పరిష్కరించి, సినిమా సజావుగా ఆడియ‌న్స్ ముందుకు వచ్చేలా కృషి చేశార‌ని కూడా వార్త‌లొచ్చాయి. ఆ కష్టాలన్నింటిని అధిగమించి రిలీజైన క‌రుప్పు ఇప్పుడు తమిళనాడులో భారీ క‌లెక్ష‌న్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం విశేషం. ఆర్థిక సమస్యలతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు విజయోత్సాహంతో ముగియడం సూర్య కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే అధ్యాయంగా మారింది.





సినిమా స‌క్సెస్ తర్వాత హీరోలు సాధారణంగా డైరెక్ట‌ర్ కు లేదా ప్రొడ్యూస‌ర్ల‌కు స్పెష‌ల్ గిఫ్ట్స్ ఇవ్వడం చూస్తుంటాం. అయితే సూర్య తీసుకున్న నిర్ణయం మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కరుప్పు సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయి అభ్యంకర్, ఎడిటర్ ఆర్ కళైవాణన్‌లకు బ్లాక్ మ్యాట్ మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ SUVలను గిఫ్ట్ గా అందించారు. ఈ ముగ్గురు టెక్నీషియన్లు తమ కొత్త కార్లతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది.





సినిమా స‌క్సెస్ కు హీరో మాత్రమే కాదు, తెర వెనుక పనిచేసే టెక్నీషియన్ల పాత్ర కూడా అంతే కీలకమని సూర్య భావిస్తూ, వారిని అభినందిస్తూ ఈ డెసిష‌న్ తీసుకున్నార‌ని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రేక్షకుల దృష్టి నటీనటులపైనే ఉంటుంది. ఒక సినిమా స‌క్సెస్‌లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ వంటి విభాగాల కృషి ఎంత ముఖ్యమో గుర్తు చేసే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇతర స్టార్ హీరోలకు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఇక కరుప్పు స‌క్సెస్‌తో డైరెక్ట‌ర్ ఆర్జే బాలాజీ కెరీర్ కూడా కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు నిర్మాతల నుంచి ఆఫర్లు అందుకుంటున్న ఆయన, కరుప్పు2 పై కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో క‌రుప్పు సీక్వెల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ వార్త మరింత ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తూ, మరోవైపు తన టీమ్‌తో ఆ ఆనందాన్ని పంచుకున్న సూర్య, స‌క్సెస్ అనేది ఒక్కరి సొత్తు కాదని, మొత్తం టీమ్ కృషికి లభించే ఫలితమని మరోసారి నిరూపించారు.