Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ ని డైల‌మాలో ప‌డేసిన శిష్యుడు!

త్రివిక్రమ్ సినిమాలంటే? ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సెంటిమెంట్ కథలతో పాటు, బలమైన సంభాషణలు ఆయన చిత్రాల్లో ప్రధాన బలం.

By:  Srikanth Kontham   |   18 Aug 2026 5:00 PM IST
త్రివిక్ర‌మ్ ని డైల‌మాలో ప‌డేసిన శిష్యుడు!
X

త్రివిక్రమ్ సినిమాలంటే? ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సెంటిమెంట్ కథలతో పాటు, బలమైన సంభాషణలు ఆయన చిత్రాల్లో ప్రధాన బలం. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా చేయాలనే గురూజీ ప్రయత్నానికి శిష్యుడైన వెంకీ అట్లూరి నుండి గట్టి పోటీ ఎదురైంది. సూర్యతో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావించినా? అదే ఛాన్స్‌ను వెంకీ అట్లూరి ముందుగానే `విశ్వ‌నాధ్ అండ్ స‌న్స్` తో ద‌క్కించుకుని గురూజీని ఆలోచనలో ప‌డేసారు. సూర్య ఇమేజ్‌కు తగినట్లుగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామాతో ముందుకు వెళ్లాలని తొలుత‌ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారిపోతుంది. వెంకీ అట్లూరి ఆ ఛాన్స్ తీసుకోవ‌డంతో త్రివిక్రమ్ అదే కోణంలో వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఒకే హీరోతో ఇద్దరు దర్శకులు ఒకే రకమైన కథాంశాలతో వస్తే ప్రేక్షకులు పోలికలు పెట్టే ప్రమాదం ఉంది. దీంతో త్రివిక్రమ్ శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. మరోవైపు త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణ ఫ్యామిలీ స్టోరీతో సరిపెట్టకుండా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మెచ్చేలా భారీ యాక్షన్ ..అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్ ఎంచు కోవడం ముఖ్యం.

సూర్యతో గురూజీ భవిష్యత్తులో సినిమా చేయాల్సి వస్తే అది పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్టుగా ఉండాలి తప్ప రెగ్యులర్ ఫ్యామిలీ జోనర్ కాకూడదనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది. గురూజీ మార్క్ డైలాగ్‌లు, కుటుంబ భావోద్వేగాలకు పేరుగాంచిన త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్కెట్ ట్రెండ్‌కు తగినట్లుగా శైలిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రాంతీయ బంధాలు, కుటుంబ కథలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కనెక్ట్ అయ్యే యూనివర్సల్ పాయింట్‌ను పట్టుకోవడం గురూజీకి సవాల్ లాంటిదే.

ముఖ్యంగా సూర్య లాంటి వర్సటైల్ యాక్టర్‌తో సినిమా అంటే కథ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాల్సిందే. అందుకే శిష్యుడు దెబ్బకు త్రివిక్రమ్ తదుపరి చిత్రం కోసం పూర్తిగా సరికొత్త కథా చర్చల్లోకి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే? టాలీవుడ్ దర్శకుల మధ్య క్రియేటివ్ పోటీ ఎంత గట్టిగా ఉంటుందో అర్థమవుతుంది. గురువు ఆలోచనలను పసిగట్టి శిష్యుడు సరైన సమయంలో స్పందించి ప్రాజెక్ట్ లాక్ చేయడం ఆసక్తికర పరిణామం. అయితే త్రివిక్రమ్ అనుభవం ముందు ఇలాంటి చిన్న చిన్న మార్పులు పెద్ద సమస్యలు కావు. త్రివిక్ర‌మ్ త‌లు చుకుంటే ఫ్యామిలీ జోనర్ నుండి బయటపడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించగల అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగలరు.