Begin typing your search above and press return to search.

సూర్య, ఫహాద్.. పెద్ద చర్చే నడుస్తోందిగా..

అదే సమయలో ఇప్పుడు కరప్పు సినిమాలో నటిస్తున్నారు సూర్య. మల్టీ టాలెంటెడ్ ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ను ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేశారు.

By:  M Prashanth   |   19 Oct 2025 11:00 PM IST
సూర్య, ఫహాద్.. పెద్ద చర్చే నడుస్తోందిగా..
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గత మూవీలు కంగువా, రెట్రో రెండూ.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. మేకర్స్ కు నష్టాలు కూడా వచ్చినట్లు టాక్ వచ్చింది.

అదే సమయలో ఇప్పుడు కరప్పు సినిమాలో నటిస్తున్నారు సూర్య. మల్టీ టాలెంటెడ్ ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ను ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేశారు. దాంతోపాటు ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఆ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పుడు ఆ రెండు సినిమాలు అయ్యాక.. మరో డైరెక్టర్ జితు మాధవన్ తో సూర్య వర్క్ చేస్తారని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆవేశం ఫేమ్ జితూతో సూర్య సినిమా తీస్తారని వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇప్పుడు అది నిజమేనని తెలుస్తోంది. త్వరలో అనౌన్స్మెంట్ రానుందని వినికిడి.

ఆ మూవీలో ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలైన నజ్రియా హీరోయిన్ గా నటిస్తారని, మాలీవుడ్ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ యాక్ట్ చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు.

సూర్య, ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ సెట్ అయితే ఓ రేంజ్ లో సినిమా ఉంటుందేమోనని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవర్ ఫుల్ క్యాస్టింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా వారిద్దరి కలయిక అందరినీ ఆకట్టుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్ అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

కానీ కొందరు ఫహాద్ ఫ్యాన్స్ మాత్రం వేరేలా కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా ఫహాద్ కామెంట్స్ ను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల పలు బడా హీరోల సినిమాల్లో నటించిన ఫహాద్.. తన టాలెంట్ ను వేస్ట్ చేసుకుంటున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారని, మరో స్టార్ హీరో మూవీలో నటించడం అవసరమా అని అంటున్నారు. మరి సూర్య, ఫహాద్ కలిసి నటిస్తున్నారో లేదో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తే గానీ క్లారిటీ రాదు.