Begin typing your search above and press return to search.

''ఇదే నిజమైన రిలేషన్''.. సూర్య ఎమోషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!

తమిళ స్టార్ హీరో సూర్య, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'.

By:  Madhu Reddy   |   3 Aug 2026 1:52 PM IST
ఇదే నిజమైన రిలేషన్.. సూర్య ఎమోషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!
X

తమిళ స్టార్ హీరో సూర్య, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ఆడియో లాంచ్ వేడుకలో సూర్య ప్రేమ, పెళ్లి, దంపతుల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం గురించి మాట్లాడిన మాటలు నెటిజన్లను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

20 ఏళ్లయినా ఆ ప్రేమ తగ్గకూడదు:

ఆడియో ఫంక్షన్ వేదికగా ప్రేమ, వైవాహిక జీవితం గురించి సూర్య మాట్లాడుతూ.. "ప్రేమ అనేది కేవలం పెళ్లితో ముగిసిపోయేది కాదు. బంధంలో అనురాగం ప్రతిరోజూ వ్యక్తమవ్వాలి. భాగస్వామిని జీవితాంతం ప్రతి రోజూ ప్రేమిస్తూనే ఉండాలి. ఇక పెళ్లై 20 ఏళ్లు గడిచినా కూడా ఆ ప్రేమ తగ్గకూడదు. వయసు పెరిగే కొద్దీ ప్రాధాన్యతలు మారినా.. భాగస్వామిపై ఉండే ఆప్యాయత ఎప్పటికీ మారకూడదు" అని ఎమోషనల్ అయ్యారు.

మహిళల త్యాగాలకు గౌరవం ఇవ్వాలి:

మహిళల ప్రాముఖ్యత గురించి చెబుతూ.. "ప్రతి కుటుంబంలోనూ పురుషుడి కంటే స్త్రీలే ఎక్కువ కష్టపడతారు. ఇల్లు చక్కదిద్దడం, పిల్లలకు జన్మనిచ్చి పెంచడంలో వారు ఎన్నో త్యాగాలు, సర్దుబాట్లు చేస్తారు. వాటిని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలి. ఇక భాగస్వామికి ప్రేమ పంచడమే కాదు, అంతకుమించి గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం" అంటూ సూర్య చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.

భారీ తారాగణం, జీవీ ప్రకాష్ మ్యాజిక్:

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని స్రే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికే ఫాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఆగస్టు 14న బిగ్ రిలీజ్:

కుటుంబ భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన కథతో వస్తున్న ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

నిజమైన హీరో అనిపించుకున్న సూర్య:

వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ తను ఎంత మంచి వ్యక్తిత్వమున్న మనిషో సూర్య తన మాటలతో మరోసారి నిరూపించారు. భార్యాభర్తల బంధంపై ఆయన చెప్పిన సత్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. మరి ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.