Begin typing your search above and press return to search.

విశ్వనాథ్ & సన్స్ కోసం సూర్య ఎమోషనల్ అప్పీల్..

సూర్య స్పీచ్ లో ఎక్కువగా ఆకట్టుకున్న అంశం, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ ను గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్. ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు తనకు అందించిన ప్రేమను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Aug 2026 5:15 PM IST
విశ్వనాథ్ & సన్స్ కోసం సూర్య ఎమోషనల్ అప్పీల్..
X

సూర్యకు తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం మరోసారి స్పష్టంగా కనిపించింది. విశ్వనాథ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాలతో తనకు ఉన్న ఎమోష‌న‌ల్ బాండింగ్ ను కూడా హృదయపూర్వకంగా పంచుకున్నారు. ముఖ్యంగా శివకుమార్ ఇద్దరు కొడుకులు తెలుగు రాష్ట్రాల దత్తపుత్రులు అని చెప్పిన మాట ఈవెంట్ లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది.

సూర్య స్పీచ్ లో ఎక్కువగా ఆకట్టుకున్న అంశం, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ ను గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్. ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు తనకు అందించిన ప్రేమను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే ప్రేమను ఇప్పుడు విశ్వనాథ్ & సన్స్ సినిమాకూ అందించాలని కోరడం ద్వారా, తన కెరీర్‌లోని ఒక ఎమోషనల్ మైల్‌స్టోన్‌ను ఈ కొత్త సినిమాతో కనెక్ట్ చేశారు. ఒక క్లాసిక్ సినిమాతో ఏర్పడిన ఆడియ‌న్స్ బాండింగ్ ను కొత్త కథకు వారధిగా మలచడం ఆయన మాట‌ల్లో స్పష్టంగా కనిపించింది.

ఈవెంట్‌లో మరో ఇంట్రెస్టింగ్ విష‌యం సూర్య తెలుగులో డైలాగ్ చెప్పడానికి చేసిన ప్రయత్నం. మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి… ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక…అని సినిమాలోని డైలాగ్ తనకు ఎంతో నచ్చిందని చెప్పిన ఆయన, దానిని తెలుగులో చెప్పే క్రమంలో కాస్త తడబడ్డారు. చివరకు డైరెక్ట‌ర్ వెంకీ సాయంతో డైలాగ్‌ను పూర్తి చేయడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. తాను డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోవడానికి కారణం, మైండ్‌లో చాలా విషయాలు ఒకేసారి నడుస్తుండటమేనని ఆయన నిజాయితీగా చెప్పడం మరింత ప్రశంసలు అందుకుంది.

సినిమాలోని ప్రతి మూమెంట్‌ను తానెంతో ఆస్వాదించానని, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని సూర్య ధీమా వ్యక్తం చేశారు. మీ ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ తెలుగు ప్రేక్షకులకు చేసిన విజ్ఞప్తి ఆయన ప్రసంగానికి భావోద్వేగ ముగింపునిచ్చింది. కోలీవుడ్ హీరో అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులతో సూర్యకు ఏర్పడిన అనుబంధం సాధారణ అభిమానాన్ని దాటి ఫ్యామిలీ బాండింగ్ లాగా మారిందనే విషయం ఆయ‌న మాట‌లు మరోసారి గుర్తు చేశాయి.