Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కూతురు.. హీరోయిన్ అందానికి ఏ మాత్రం త‌గ్గ‌దు!

సినీ సెల‌బ్రిటీల‌కు ఉండే ఫాలోయింగ్ తెలిసిందే. వారు ఎక్క‌డికెళ్లినా కెమెరాలు వెంటాడుతూనే ఉంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 Aug 2025 5:00 PM IST
స్టార్ హీరో కూతురు.. హీరోయిన్ అందానికి ఏ మాత్రం త‌గ్గ‌దు!
X

సినీ సెల‌బ్రిటీల‌కు ఉండే ఫాలోయింగ్ తెలిసిందే. వారు ఎక్క‌డికెళ్లినా కెమెరాలు వెంటాడుతూనే ఉంటాయి. కేవ‌లం సెల‌బ్రిటీల‌ను మాత్ర‌మే కాకుండా వారి కుటుంబ సభ్యుల‌కు కూడా ఇది త‌ప్ప‌దు. మ‌రీ ముఖ్యంగా సెల‌బ్రిటీల పిల్ల‌లు బ‌య‌ట క‌నిపిస్తే వారిని ఫోటోలు, వీడియోలు తీసి ఆ రోజంతా వారిని వార్త‌ల్లో నిలిచేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడ‌లానే ఓ సెల‌బ్రిటీ కూతురు వార్త‌ల్లోకెక్కింది.

టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో ఎంతో ఫేమ‌స్ అయిన స్టార్ జోడీల్లో సూర్య‌- జ్యోతిక కూడా ఒక‌రు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీర‌ద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌లు. వారే దియా, దేవ్. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఈ ఇద్ద‌రూ ఫ్యామిలీకి త‌గిన టైమ్ ఇస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. అయితే సూర్య కేవ‌లం సినిమాలు మాత్ర‌మే కాకుండా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తూ అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకుంటూ ఉంటారు.

అంద‌రి దృష్టిలో ప‌డిన దియా

అగ‌రం అనే ఫౌండేష‌న్ ద్వారా ఎంతోమంది నిరుపేద‌ల‌కు విద్య‌ను అందించిన సూర్య రీసెంట్ గా అగ‌రం 15వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొని, ఆ త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి తిరుమ‌ల వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌న అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన సూర్య ఫ్యామిలీ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, ఆ ఫోటోలు, వీడియోల్లో సూర్య కూతురు దియా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

సూర్య పిల్ల‌ల్ని చూసి అప్పుడే ఇంత పెద్ద వాళ్లైపోయారా అని కొంద‌రు కామెంట్స్ చేస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం దియా త‌న త‌ల్లి జ్యోతిక కంటే అందంగా త‌యారైంద‌ని, త్వ‌ర‌లోనే హీరోయిన్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని పొగుడుతూ దియా ఫోటోల‌ను నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. చూడ్డానికి పెద్ద‌వాళ్లైన‌ట్టు క‌నిపించినా దియా, దేవ్ ఇద్ద‌రూ వారి వారి చ‌దువుల్లో బిజీగా ఉన్నారు. ఒక‌వేళ వారికి సినిమాల్లోకి రావాల‌నే ఇంట్రెస్ట్ ఉన్నా అది చ‌దువులు పూర్త‌య్యాకే కాబ‌ట్టి ఇప్ప‌ట్లో సూర్య ఫ్యాన్స్ ఆ ఆలోచ‌న‌ను మానుకుంటే బెట‌ర్.