సౌత్ లో సరే? నార్త్ సంగతేంటి?
సూర్య కోలీవుడ్ సహా టాలీవుడ్ లో ఓ పెద్ద స్టార్. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
By: Srikanth Kontham | 8 Dec 2025 11:00 PM ISTసూర్య కోలీవుడ్ సహా టాలీవుడ్ లో ఓ పెద్ద స్టార్. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు. కోలీవుడ్ తరహాలోనే టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. ఓ తెలుగు స్టార్ లాగే సూర్యని భావిస్తున్నారు. సూర్య సోదరుడు కార్తీని కూడా అంతే అభిమానిస్తుంటారు. తెలుగ అభిమానులకు భాష, ప్రాంతంతో సంబంధం లేదు. నచ్చాడంటే గుండెల్లో పెట్టుకుంటారు. అదే తెలుగు ప్రేకు లను మిగతా భాషల అభిమానుల నుంచి వేరు చేస్తుంది. అందుకే తెలుగు లో సక్సెస్ అయిన ప్రతీ నటుడు ఇక్కడ అభిమానులంటే? ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా సూర్య మాలీవుడ్ లో కూడా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే.
తొలి ప్రయత్నం వైఫల్యంతో:
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగులో కూడా వెంకీ అట్లూరి సినిమాతో లాంచ్ అవుతున్నాడు. రెండు భాషల్లోనూ ఒకేసారి లాంచ్ అవ్వడం విశేషమే. ఇదంతా పక్కన బెడితే? సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? అన్నది ఆసక్తికరం. ఇప్పటి వరకూ సూర్య హిందీ సినిమా ఆలోచన చేయలేదు. ధనుష్ లాంటి స్టార్ కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని దున్నేస్తున్నా? సూర్య మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నాడు. సౌత్ నుంచి చాలా మంది నటులు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నా? సూర్య మొదటి ప్రయత్నం `కంగువ` ఫెయిలవ్వడంతో కామ్ అయ్యాడు.
ఈ మౌనం ఇంకెంత కాలం:
కానీ ఈ మౌనం ఎంత కాలం. హీరోల మార్కెట్ ఫరిది అంతకంతకు విస్తరిస్తోన్న సమయమిది. చరణ్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్లు ఇప్పటికే ఇండియాని దున్నేస్తున్నారు. విదేశాల్లోనూ సత్తా చాటుతున్నారు. కానీ సూర్య లాంటి ప్రతిభావంతుడు ఇంకా కోలీవుడ్ కే పరిమితమై పని చేయడం అభిమానుల్ని కలవర పెడుతుంది. మరి అభిమానుల కోరిక మేరకు సూర్య ఆ దిశగా ఆలోచన చేస్తాడా? అన్నది చూడాలి. ఇప్పటికే సూర్య కుటుంబంతో ముంబైకి షిప్ట్ అయిన సంగతి తెలిసిందే. చెన్నై ను వీడి మూడేళ్లు అవుతుంది. సూర్య సతీమణి జ్యోతిక కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు.
సౌత్ పరిశ్రమ కంటే హిందీ పరిశ్రమలోనే మంచి గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నారు. మరి భార్య వైపు నుంచి ఇంత పాజిటివిటీని చూసి సూర్య ఎందుకు హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టలేదు అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికే సూర్య నటించిన కొన్ని సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.
