Begin typing your search above and press return to search.

51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లను తీర్చిదిద్దిన ఏకైక హీరో?

పేరుకే కోలీవుడ్ హీరో అయినప్పటికీ తన చిత్రాల ద్వారా తెలుగు, హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ మరింత పేరు సొంతం చేసుకున్నారు.

By:  Madhu Reddy   |   14 May 2026 11:27 AM IST
51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లను తీర్చిదిద్దిన ఏకైక హీరో?
X

వెండితెరపై ఆడియన్స్ ను అలరించడమే కాదు నిజజీవితంలో కూడా గొప్ప మనసు చాటుకుంటూ ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతున్నారు సెలబ్రిటీలు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో రీల్ హీరోలు కాస్త రియల్ హీరోలుగా పేరు దక్కించుకుంటున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సోనుసూద్ లాంటి హీరోలు తెరపై సందడి చేయడమే కాకుండా నిజజీవితంలో కూడా లక్షలాది మంది ప్రజలకు అండగా నిలుస్తూ ఆదుకుంటున్నారు. ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా కష్ట సమయాలలో అండగా నిలుస్తూ అటు వైద్య పరంగా ఉచితంగా సేవలు అందిస్తున్నారు అంతేకాదు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా కల్పిస్తూ వారి పాలిట దేవుళ్ళుగా మారుతున్న విషయం తెలిసిందే.

ఇక ముఖ్యంగా సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపారాలలో పెట్టుబడులుగా పెట్టి ఆస్తులు పెంచుకోవడమే కాకుండా.. ఆ డబ్బును ఇతరుల కోసం కూడా ఉపయోగిస్తూ గొప్ప మనసున్న మహారాజులుగా పేరు పొందుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు చాలామంది హీరోలను, హీరోయిన్లను, ఆర్థిక సహాయం చేసిన వారిని చూసాము.. అన్నదానం చేసిన వారిని చూసాం. కానీ ఇక్కడ విద్యాదానం చేసి అందరి హృదయాలను ఆకట్టుకున్నారు ఒక స్టార్ హీరో.. తను చేసిన ఈ విద్యాదానం వల్ల 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లుగా మారి లక్షలాది మందికి సహాయపడుతున్నారు. మరి ఇంత గొప్ప కార్యానికి కంకణం చుట్టిన ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.

పేరుకే కోలీవుడ్ హీరో అయినప్పటికీ తన చిత్రాల ద్వారా తెలుగు, హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ మరింత పేరు సొంతం చేసుకున్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపారాలలో పెట్టబడులుగా పెడుతూ మరింత ఆదాయాన్ని పెంపొందించుకున్నారు.. అంతేకాదు ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించి పలు చిత్రాలను నిర్మిస్తున్న ఈయన.. విద్యాదానం కూడా చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. 2006లో అగరం ఫౌండేషన్ ను స్థాపించిన హీరో సూర్య ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలలో ఆశా కిరణంగా నిలిచారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మొదటి తరం విద్యార్థులు ఉన్నత విద్యా చదవాలని కలలు కంటున్నా.. ఆ కలలను నెరవేర్చుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక వెనుకబడి పోతున్నారు . అలాంటి వారిని గుర్తించి వారికి అండగా నిలిచారు సూర్య.

విధై అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెంటరింగ్ , గైడెన్స్, అకాడమిక్ సపోర్ట్ తో పాటు స్కాలర్షిప్స్ ని కూడా అందిస్తూ డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెషనల్గా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తున్నారు. ఇక 2025 నాటికి ఈ అగరం ఫౌండేషన్ 8వేల మందికి పైగా విద్యార్థుల జీవితాలను మార్చగా.. అందులో 6,700 మందికి పైగా మొదటి తరం గ్రాడ్యుయేటర్ లను సమాజానికి అందించినట్లు సమాచారం. దళిత విద్యార్థులు, గిరిజన సమాజాలు, శ్రీలంక శరణార్థులు వంటి వెనుకబడిన వర్గాలకు కూడా ఈ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది.

ముఖ్యంగా విద్యా సంస్థలతో భాగస్వామ్యం చేసి, సీట్లు, వసతి, అవసరమైన సహాయం కూడా ఈ ఫౌండేషన్ అందిస్తోంది . మొత్తానికి అయితే ఈ అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లు తయారైనట్లు సమాచారం. ఏది ఏమైనా సూర్య చేస్తున్న ఈ సేవ ఒక గొప్ప సందేశం ఇస్తోంది. అసలు స్టార్ డం అంటే కేవలం సినిమాలలో కాదు.. జీవితాలను మార్చడంలో ఉంది అని ఇలాంటి తారలు నిరూపిస్తున్నారు.