Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ కోసం న‌యా స్టార్ !

కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది పడిన కోలీవుడ్ స్టార్ సూర్య‌ వరుస హిట్ల‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   25 Aug 2026 9:30 AM IST
హ్యాట్రిక్ కోసం న‌యా స్టార్ !
X

కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది పడిన కోలీవుడ్ స్టార్ సూర్య‌ వరుస హిట్ల‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేస్తున్నారు. వైవిధ్యమైన కథలతో పాటు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `కరుప్పు` సినిమాతో పాటు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన `విశ్వనాధ్ అండ్ సన్స్` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. విభిన్న కథాంశాలతో రూపొందిన రెండు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను రాబట్టాయి.

దీంతో సూర్య అభిమానులు ఆనందానికి అవ‌దులు లేవు. ఈ రెండు విజ‌యాలు సూర్య‌ కెరీర్‌కు బలమైన బూస్ట్‌ను ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే సూర్య న‌టిస్తోన్న‌ 47వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.`ఆవేశం` ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ జితు మాధవన్‌తో ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇందులో సూర్య పాత్రకు సంబంధించి ఇండస్ట్రీలో ప్రత్యేక చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్పటి వరకు రకరకాల ప్రయోగాత్మక పాత్రలు చేసిన సూర్య ఈ చిత్రంలో ఓ సరికొత్త కోణంలో కనిపించ బోతున్నారు. ఇందులో ఆయన విభిన్నమైన మనస్తత్వం కలిగిన అసాధారణ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. సీరియస్ పోలీస్ కథగానే కాకుండా తనలాగే భిన్నమైన ఆలోచనలు, ప్రవర్తన ఉన్న ఓ ప్రత్యేక పోలీసు బృందానికి ఆయన లీడర్‌గా వ్యవహరిస్తారట. ఈ కథ పూర్తిస్థాయి యాక్షన్, కామెడీ , బలమైన భావోద్వేగాల మేళవింపుతో సాగుతుందని తెలుస్తోంది. జీతు మాధవన్ మార్క్ మేకింగ్ స్టైల్‌కు తగినట్లుగా చిత్రంలో వినోదం - యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని సమాచారం.

ఇదే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా గ‌నుక హిట్ అయితే సూర్య కెరీర్ లో హ్యాట్రిక్ న‌మోదైన‌ట్లే. వ‌రుస ప్లాప్ లు చూసి సూర్య కు మ‌ళ్లీ హ్యాట్రిక్ ప‌డితే మార్కెట్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. వ‌రుస ప్లాప్ ల స‌మ‌యంలో మార్కెట్ డౌన్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ సూర్య మాత్రం ఎక్క‌డా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా క‌థ‌ల విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకుని కెరీర్ ని మ‌ళ్లీ ట్రాక్ లో పెట్టారు. ప్రస్తుతం సూర్య క్రేజ్ కోలీవుడ్‌కే పరిమితం కాలేదు.

ఆయ‌న క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో విస్తరిస్తున్న తరుణంలో హ్యాట్రిక్ సెంటిమెంట్ సూర్య‌ మార్కెట్‌ను మరింత బలపరుస్తుంది. ట్రేడ్ వర్గాలు కూడా సూర్య 47వ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. అలాగే సూర్య 48వ చిత్రం కూడా ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి టీజే జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే `జై భీమ్` లాంటి సంచ‌ల‌న హిట్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇదీ హిట్ అందుకుంటే? సూర్య ఖాతాలో వ‌రుస‌గా నాల్గ‌వ హిట్ న‌మోదైన‌ట్లే. త‌దుప‌రి సూర్య డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ కి రెడీ అవుతారు.