సూర్య 45.. కత్తుల తరువాత ఇప్పుడు ఏం సర్‌ప్రైజ్ ఇస్తారో..
తమిళ సినీ ఇండస్ట్రీలో తన విభిన్నమైన పాత్రలతో పేరు తెచ్చుకున్న వెర్సటైల్ హీరో సూర్య, వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 20 Jun 2025 12:00 AM ISTతమిళ సినీ ఇండస్ట్రీలో తన విభిన్నమైన పాత్రలతో పేరు తెచ్చుకున్న వెర్సటైల్ హీరో సూర్య, వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆయన నటించిన రెట్రో మూవీ అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు అతడి 45వ సినిమాగా రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను డైరెక్టర్ ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తున్నాడు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం మరో హైలైట్. ఇదివరకే “సూర్య 45” ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్‌లో భయపెట్టేలా ఉండే పెద్ద కత్తులు, గుర్రం నేపథ్యంలో అద్భుతమైన విజువల్ ట్రీట్ చూపించారు. ఈ ప్రీ లుక్‌కి పెద్ద రెస్పాన్స్ రావడంతో ఫస్ట్ లుక్‌పై మరింత హైప్ ఏర్పడింది.
తాజాగా మేకర్స్ అధికారికంగా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 20న “సూర్య 45” ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మరోసారి అంచనాలను పెంచేశారు. ఇప్పటికే దీనిపై సినీ విశ్లేషకులు, ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు. ఫస్ట్ లుక్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని ప్రకటించారు. ఈ సినిమా కథలో కొత్తదనం, ప్రెజెంటేషన్ లో బలమైన మెసేజ్ ఉండేలా దర్శకుడు ఆర్ జె బాలాజీ డిజైన్ చేశారని సమాచారం.
ఈ సినిమాలో సూర్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్. ఆయన కెరీర్‌లో మరో లెవెల్ ను పెంచే సినిమా కావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వారంతా ఇది ఓ ఇంటెన్స్ సోషల్ డ్రామా కాబోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉన్న నేపథ్యంలో, కథన బలాన్ని రెట్టింపు చేయనుంది. రెహమాన్ - సూర్య కాంబినేషన్ గతంలో కూడా పలుమార్లు మ్యాజిక్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఏఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి స్థాయి ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య అభిమానులే కాక, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ మూవీ తర్వాత సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.
