Begin typing your search above and press return to search.

సూర్య కొత్త మూవీలో కొత్తలోక హీరో..

అదేంటంటే..సూర్య నటించబోతున్న సూర్య47వ సినిమాలో కొత్తలోక హీరో నటిస్తున్నట్టు తెలుస్తోంది..

By:  Madhu Reddy   |   30 Oct 2025 6:00 PM IST
సూర్య కొత్త మూవీలో కొత్తలోక హీరో..
X

కోలీవుడ్ నటుడు సూర్య వరుస ఫ్లాపులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది వచ్చిన రెట్రో మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ ఆయన ఆ సినిమా ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా తన నెక్స్ట్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సూర్య , వెంకీ అట్లూరి డైరెక్షన్లో తన 46వ సినిమా చేస్తున్నారు. త్వరలోనే 47వ సినిమా కూడా స్టార్ట్ అవబోతుందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అలా మూడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సూర్య నెక్స్ట్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తోంది.

అదేంటంటే..సూర్య నటించబోతున్న సూర్య47వ సినిమాలో కొత్తలోక హీరో నటిస్తున్నట్టు తెలుస్తోంది.. సూర్య హీరోగా, జీతూ మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా..నజ్రియా నజీమ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ప్రేమలు మూవీ ద్వారా సౌత్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిన మలయాళ నటుడు నస్లెన్ కే.గఫూర్ ఓ కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది..

ఈ సినిమాకి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహించడంతో కీలకమైన పాత్రల్లో మలయాళ నటులనే ఎక్కువగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అలా ఇప్పటికే నజ్రియా నజీమ్ హీరోయిన్ గా సైన్ చేయగా.. ఫహద్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొంతమంది అంటే.. మరి కొంత మందేమో విలన్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు. ఇక పాత్ర పై క్లారిటీ రావాల్సి ఉంది.

అలాగే తాజాగా మలయాళ నటుడు ప్రేమలు మూవీ ద్వారా ఫేమస్ అయిన నెస్లన్ కే గఫూర్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.. అయితే సూర్య తన 47 మూవీలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ టీంలో నస్లెన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మలయాళ నటుడు నస్లెన్ వరుస సినిమాల్లో కీరోల్స్ చేస్తూ తన కెరీయర్ లో ముందుకు పోతున్నారు.

ఈ మధ్యనే మలయాళంలో వచ్చిన కొత్త లోక మూవీలో కూడా ఒక నస్లెన్ ఓ కీ రోల్ పోషించారు. కళ్యాణి ప్రియదర్శిన్ ని ఇష్టపడే సన్నీ అనే పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. అలా వరుస సినిమాలు చేస్తూ నస్లెన్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు..