Begin typing your search above and press return to search.

టికెట్ ధ‌ర‌ల‌పై సురేష్ బాబు కొత్త బాణీ!

ఓవ‌ర్సీ..బెంగుళూరు ప‌ట్ట‌ణాల త‌ర‌హాలో ఉన్న ప‌ద్ద‌తిని తెలుగు రాష్ట్రాల్లో అనుస‌రించాల‌ని సూచించారు

By:  Tupaki Desk   |   18 Aug 2023 7:28 AM GMT
టికెట్ ధ‌ర‌ల‌పై సురేష్ బాబు కొత్త బాణీ!
X

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధ‌ర‌లు ఎలా ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల‌కు తొలి వారం ఒక ధ‌ర‌..అటుపై మ‌రో ర‌క‌మైన ధ‌ర అమలులో ఉంటుంది. సినిమా రిలీజ్ కి ముందు ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే అద‌నంగా పెంచుకునే వెసులు బాటు ఉంటుంది. అందుకు ప్ర‌భుత్వం ముందు కొన్ని ర‌కాల డాక్యుమెంట్లు ఉంచాల్సి ఉంటుంది. అంతా ఒకే అనుకుంటే గ్రీన్ సిగ్నెల్ ఇస్తుంది. లేదంటే పాత ప‌ట్టిక ప్ర‌కారం టికెట్లు విక్ర‌యిచాల్సి ఉంటుంది. ఈనేప‌థ్యంలో తాజాగా అగ్ర నిర్మాత‌-డిస్ట్రిబ్యూట‌ర్ సురేష్ బాబు టికెట్ ధ‌ర‌ల విష‌యంలో కొత్త బాణీని తెర‌పైకి తెచ్చారు.

ఓవ‌ర్సీ..బెంగుళూరు ప‌ట్ట‌ణాల త‌ర‌హాలో ఉన్న ప‌ద్ద‌తిని తెలుగు రాష్ట్రాల్లో అనుస‌రించాల‌ని సూచించారు. వారాంతాల్లో ఒకలా.. మిగతా రోజుల్లో మరోలా టికెట్ రేట్లు పెంచుకునే..తగ్గించుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుందంటున్నారు. ఒక వారంలో టికెట్ రేట్లు పెంచుకోవ‌డం లేదా త‌గ్గించుకోవ‌డం అనే సౌల‌భ్యాన్ని నేరుగా థియేట‌ర్ల‌కు క‌ల్పించాల‌న్నారు. గ‌రిష్ట టికెట్ రేటుతో పాటు త‌గ్గించుకునే వెసులు బాటు ఇవ్వాలి. ఉదాహ‌ర‌ణ‌గా..వారంతంలో టికెట్ 250 రూపాయ‌లు అమ్మితే..సాధ‌రాణ రోజుల్లో 150 రూపాయ‌ల‌కు అమ్మాలి. ఇది థియేట‌ర్ మ‌నుగుడ‌కి ఎంతో మేలు చేస్తుంది.

ఈ మ‌ధ్య థియేట‌ర్లో ఆక్యుపెన్సీ పెరిగందంటున్నారు. అందంతా భ్ర‌మ‌. ప్రేక్ష‌కులు కేవ‌లం మంచి సినిమాలు చూసేందుకే థియేట‌ర్ వ‌స్తున్నారు. ప్లాప్ సినిమాకి ఎలాంటి ఆక్యుపెన్సీ ఉండ‌టం లేదు. ప్రతి రోజూ ఫుట్ ఫాల్ ను గమనిస్తున్నాం. కానీ ఎక్కడా ఆక్యుపెన్సీ శాతం పెరిగినట్టు గమనించలేదన్నారు. ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు చిన్న సినిమా..పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా థియేట‌ర్ కి వెళ్లి చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అంటే ప్రోడ‌క్ష‌న్ బాగుంటుంది.

భారీ సెట్లు..విదేశీ లొకేష‌న్లు ఉంటాయి అన్న‌ది అన్ని సంద‌ర్భాల్లో ప‌నిచేయ‌దు. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'జైల‌ర్' మంచి విజ‌యం సాధించింది. అంత‌కు ముందు ర‌జ‌నీ కాంత్ సినిమాల‌న్నీ ప్లాప్ అయ్యాయి. 'విరూపాక్ష‌'..'బేబి' లాంటి చిన్ని సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక్క‌డ అర్ద‌మైంది ఏంటి? సినిమా కంటెంట్ మాత్ర‌మే కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని క్లారిటీ వ‌స్తుంది. మంచి క‌థ‌లు దొర‌క‌కే నిర్మాణం త‌గ్గించాను..రానా...అభిరామ్ తో మంచి సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు' తెలిపారు.