తెలుగులో అక్షయ్ కుమార్ లేటెస్ట్ హిట్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ తెలుగులో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 14 May 2025 1:27 PM ISTబాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ తెలుగులో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బ్రిటిష్ కాలనీ దురాగతాలను ఎదిరించిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా హిందీలో ఏప్రిల్ 18 విడుదలై బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 23న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. జలియన్‌వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందిన ఈ ‘కేసరి 2’ సినిమా ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మితమైంది. ఇక తెలుగు రిలీజ్‌ను సురేష్ ప్రొడక్షన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. కరణ్ సింగ్ త్యాగి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా, హిందీలో విడుదలైన తర్వాత జాతీయ స్థాయిలో మంచి ఆదరణ పొందింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బజ్ పెరుగుతోంది, దీంతో ఇక్కడ కూడా భారీ విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా టేబుల్ ప్రాఫిట్ సాధించింది, అయితే థియేటర్లలో కూడా ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ‘కేసరి 2’ తెలుగు విడుదల కూడా అభిమానులను ఆకర్షించే అవకాశం ఉంది. అక్షయ్ కుమార్‌తో పాటు ఆర్. మాధవన్, అనన్యా పాండే కీలక పాత్రల్లో నటించారు, వీరి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సినిమా కథ 1919 జలియన్‌వాలా బాగ్ మారణకాండ చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ సైన్యం అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటనను ఎదిరించి, న్యాయం కోసం పోరాడిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు.
ఈ సినిమా రఘు పాలత్, పుష్ప పాలత్ రాసిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ కథ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మొత్తంగా, ‘కేసరి 2’ తెలుగు విడుదల సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకింగ్‌తో గ్రాండ్‌గా జరగనుంది. ఈ నెల 23న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
