ఇల్లు అమ్మేసి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నిర్మాత ఆదుకున్నారు!
నా జీవితంలో అస్సలు సెటిల్ అవ్వలేదని, పరిస్థితి బాగోలేక ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని చాలా బాధపడినట్టు చెప్పారు.
By: Sivaji Kontham | 1 May 2026 10:43 AM IST``నేను ఒకానొక దశలో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లైఫ్ లో అస్సలు సెటిల్ అవ్వలేదని చాలా బాధపడ్డాను. ఆ సమయంలోనే రామానాయుడు గారిని కలిశాను. ఆయన్ని కలిసిన పదిహేను రోజుల్లోనే నన్ను పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుస అవకాశాలు తన జీవితాన్ని మార్చేసాయని చెప్పారు సీనియర్ నటుడు సురేష్.
నటుడు సురేష్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి.. దిగ్గజ నిర్మాణ సంస్థల ద్వారా నిలదొక్కుకోవడం అనేది నేటి తరం నటులకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయం. అప్పటికే పెళ్లయింది.. భార్య ఉంది. కానీ ఇల్లు అమ్మాల్సొచ్చింది. సొంత ఇంటిని అమ్మేసి నటుడిగా ప్రయత్నిస్తున్నా ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. దీంతో అతడు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలోనే నటుడు సురేష్ తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను, దిగ్గజ నిర్మాణ సంస్థలతో తనకున్న అనుబంధాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆయన మాట్లాడిన మాటల సారాంశం లోకి వెళితే...
నా జీవితంలో అస్సలు సెటిల్ అవ్వలేదని, పరిస్థితి బాగోలేక ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని చాలా బాధపడినట్టు చెప్పారు. సరిగ్గా ఆ సమయంలోనే నేను రామానాయుడు గారిని కలిశాను. ఆయన్ని కలిసిన పది పదిహేను రోజుల్లోనే నాకు పిలుపు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై `పుట్టింటికి పట్టు చీర` అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు.
రామానాయుడు గారి బ్యానర్‌లో నేను సినిమా చేస్తున్నానని తెలియగానే.. అదే సమయంలో నాకు పద్మాలయ బ్యానర్‌లో చిన్నకోడలు లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో `మామశ్రీ` సినిమాలో ఛాన్సొచ్చింది. కేవలం మూడు నాలుగు నెలల వ్యవధిలోనే నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ మూడు సినిమాలు పెద్ద హిట్ అవ్వడంతో మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు... అని తెలిపారు. అయితే దగ్గుబాటి రామానాయుడుతో తన తండ్రికి మంచి పరిచయం ఉందని చెప్పిన సురేష్ .. తాను కష్టంలో ఉన్నానని సూటిగా ఉన్న విషయం చెప్పి అవకాశం అడగడంతో
ఒకేసారి ముగ్గురు దిగ్గజ నిర్మాతలు రామానాయుడు, కృష్ణ, రామోజీరావు బ్యానర్లలో అవకాశాలు రావడం సురేష్ కెరీర్‌ను చాలా మార్చేసింది. ఆ తర్వాత అతడు టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలలో ఒకరిగా వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి దిగ్గజాలు ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే సురేష్ అనే మరో హీరో మనుగడ సాగించడం నిజంగా ఆసక్తికరం. అతడు ప్రతిభతో కథానాయకుడిగా, సహాయ నటుడిగా, విలన్ గా విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు.
