Begin typing your search above and press return to search.

సురేందర్ రెడ్డి - పవన్.. కథ మారిందా?

మొదట వీరు కూడా యాక్షన్ డ్రామా కథతో రావాలని అనుకున్నారు. కానీ మళ్ళీ కథను మార్చి పొలిటికల్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   14 Sep 2023 4:46 AM GMT
సురేందర్ రెడ్డి - పవన్.. కథ మారిందా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే ఏపీలో రాజకీయంగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బలమైన శక్తిగా ఎదగడానికి వ్యూహాత్మకంగా ముందుకి వెళ్తున్నారు. ఇప్పటికే మూడు దశలలో వారాహి యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ నాలుగో దశకి సిద్ధం అవుతున్నారు. మరో వైపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడంపైన దృష్టి పెట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

అలాగే సుజిత్ దర్శకత్వంలో OG మూవీ షూటింగ్ ఫినిష్ చేయడానికి అక్టోబర్ లో కాల్ షీట్స్ ఇచ్చారంట. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తుళ్లూరు నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడంట.

మొదట వీరు కూడా యాక్షన్ డ్రామా కథతో రావాలని అనుకున్నారు. కానీ మళ్ళీ కథను మార్చి పొలిటికల్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకి పెర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చే విధంగా ఎన్నికల లోపు ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. అందుకే వీలైనంత వేగంగా మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో ఇదే విషయంపై చర్చ నడుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ ఆలోచిస్తున్నారు. ఇక OG మూవీ అయితే మార్చి ఆఖరున ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ లేదా మే లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట.

ఈ సినిమా తన పొలిటికల్ కెరియర్ కి కూడా హెల్ప్ అవుతుందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారంట. అందుకే వేగంగా పూర్తి చేయాలని సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒక వేళ సురేందర్ రెడ్డి మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అయితే మాత్రం ఈ ప్రచారం వాస్తవమని అనుకోవచ్చు.