Begin typing your search above and press return to search.

పవన్‌ కన్నా ముందు బాలీవుడ్‌ హీరోతో 'ఏజెంట్‌'..!

అతనొక్కడే, కిక్‌, ధృవ, సైరా చిత్రాలతో దర్శకుడిగా మంచి హిట్స్ దక్కించుకున్న సురేందర్‌ రెడ్డి ఏజెంట్‌ సినిమాతో డిజాస్టర్ చవిచూశాడు

By:  Tupaki Desk   |   10 Feb 2024 7:11 AM GMT
పవన్‌ కన్నా ముందు బాలీవుడ్‌ హీరోతో ఏజెంట్‌..!
X

అతనొక్కడే, కిక్‌, ధృవ, సైరా చిత్రాలతో దర్శకుడిగా మంచి హిట్స్ దక్కించుకున్న సురేందర్‌ రెడ్డి ఏజెంట్‌ సినిమాతో డిజాస్టర్ చవిచూశాడు. ఏజెంట్‌ ఫ్లాప్ నుంచి వెంటనే తేరుకున్న సూరి కథలు రెడీ చేయడం మొదలు పెట్టాడు. తెలుగు హీరోల్లో చాలా మందిని సురేందర్ రెడ్డి సంప్రదించాడు.

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే పవన్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు మూడు ఉండటంతో పాటు, రాజకీయాల కారణంగా ఇప్పట్లో పవన్‌ నుంచి సురేందర్ రెడ్డికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే పరిస్థితి లేదు. దాంతో మరో హీరోతో సూరి సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు.

తెలుగు హీరోల నుంచి స్పందన లేకపోవడంతో బాలీవుడ్‌ లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ మధ్య కాలంలో సౌత్‌ దర్శకులకు బాలీవుడ్ లో సూపర్ డూపర్‌ హిట్స్ పడ్డాయి. వెయ్యి కోట్లు దక్కించుకున్న జవాన్‌ మరియు 900 కోట్లు వసూళ్లు చేసిన యానిమల్‌ సినిమాల దర్శకులు సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన వారే అనే విషయం తెల్సిందే.

అందుకే బాలీవుడ్‌ అగ్రహీరోలు అంతా కూడా సౌత్‌ నుంచి దర్శకులు వచ్చి సంప్రదిస్తే నో అనడం లేదు. మంచి కథతో వస్తే సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్‌ హీరో రణవీర్ సింగ్‌ తన తదుపరి సినిమాను సూరితో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సురేందర్‌ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ ను చర్చించేందుకు గాను త్వరలో ముంబై రావాల్సిందిగా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. గతంలో సూరి సూపర్‌ డూపర్ హిట్స్ ను రూపొందించాడు. అందుకే రణవీర్ సింగ్ కనుక నమ్మకం ఉంచితే సురేందర్‌ రెడ్డి మొదటి హిందీ సినిమా ఇదే ఏడాది పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏజెంట్ సినిమా డిజాస్టర్ తో చాలా పాఠాలు నేర్చుకుని సురేందర్‌ రెడ్డి తదుపరి సినిమా విషయంలో అయినా మరింత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా బడ్జెట్‌ నియంత్రణ అనేది ముఖ్యం అంటూ సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.