Begin typing your search above and press return to search.

లైవ్ లో సురేఖవాణి గ్లామర్ ఎటాక్.. ఆ రూమర్స్ కు చెక్

రెండు పదుల వయసున్న కూతురు ఉన్నప్పటికీ కూడా సురేఖవాని ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:15 PM GMT
లైవ్ లో సురేఖవాణి గ్లామర్ ఎటాక్.. ఆ రూమర్స్ కు చెక్
X

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అంఫుకున్న సురేఖ వాణి ఇప్పుడు మాత్రం అల్ట్రా గ్లామర్ తో సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చూసినా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో నిమిషాల్లో వైరల్ అవ్వాల్సిందే. రెండు పదుల వయసున్న కూతురు ఉన్నప్పటికీ కూడా సురేఖవాని ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

ఇక సురేఖ వాణి ప్రతిసారి కూడా తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను అంతకుమించి అనేలా పెంచుకుంటూనే ఉందని చెప్పవచ్చు. రీసెంట్ గా ఆమె మరోసారి షాక్ అయ్యేలా దర్శనం ఇచ్చింది. గోవా వెళ్లిన సురేఖవాని అక్కడ రిసార్ట్ లో చిల్ అవుతు లైవ్ లో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అలాగే ఆమె తన గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

తనతో పాటు కూతురు సుప్రీత కూడా ఉందని చెప్పిన ఆమె తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను బాగానే ఉన్నాను అంటూ ఎలాంటి సమస్య లేదని పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. అలాగే గోవాలో సమ్మర్ వేడి గట్టిగానే ఉందని ఆమె వివరణ ఇచ్చారు.

చాలా హ్యాపీగా నవ్వుతూ ఆమె లైవ్ లో కనిపించింది. సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలను నటించింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్ మలయాళం భాషలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇక సినిమా ఛాన్సులు వస్తున్నా రాకపోయినా కూడా సురేఖవాని మాత్రం సోషల్ మీడియాలో చాలా బిజీగా కనిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆమె కు ఈ తరహా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉనికిని చాటుకుంటుంది.

ఇక ఇప్పుడు గోవాలో ఇలా అందంగా ఇన్ స్టా లైవ్ లో మరింత గ్లామర్ గా కనిపించింది. ఇక సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందని గతంలోనే కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఎప్పుడూ కూడా ఆమె ఆ విషయంపై సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. నేను ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకుంటే తప్పు ఏమిటి అనే విధంగా కూడా విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.

కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ ద్వారా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ఇక సినిమాలో కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు ఒక చిన్న సినిమాలో నరిస్తోంది. మరి ఆ సినిమాతో ఆమె రెగ్యులర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీ అవుతుందో లేదో చూడాలి.