Begin typing your search above and press return to search.

సురేఖ కూతురు@22.. సినీ ఎంట్రీ ఎప్పుడంటే?

రెగ్యులర్ గా తమ అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా మతి పోగొట్టే పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తుంటారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 1:12 PM GMT
సురేఖ కూతురు@22.. సినీ ఎంట్రీ ఎప్పుడంటే?
X

సోషల్ మీడియాను హీటెక్కించడంలో ముందు వరుసలో ఉంటున్నారు తల్లీకూతుళ్లు సురేఖావాణి, సుప్రిత. రెగ్యులర్ గా తమ అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా మతి పోగొట్టే పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తుంటారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ నెటిజన్లను తమదైన కోణంలో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారిద్దరూ.. అప్పుడప్పుడూ ఊహించని పిక్స్ నుస కూడా షేర్ చేస్తుంటారు.

ముఖ్యంగా సురేఖ కూతురు సుప్రిత తన కొత్త ఫొటో షూట్ చేయడమే చాలు.. అమ్మడు హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్లు రచ్చరచ్చ చేస్తుంటారు. సుప్రిత ఫొటోలకు లైకుల వర్షం కురిపిస్తుంటారు. పిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తుంటారు. టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నిస్తుంటారు. త్వరలోనే సుప్రిత.. సినీ ఎంట్రీ అంటూ కొందరు చెప్పేస్తుంటారు. అలా అనేక రూమర్లు కూడా వచ్చాయి.

తాజాగా సుప్రిత.. ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఆ సమయంలో తన సినీ ఎంట్రీపై స్పందించింది. త్వరలో ఎంట్రీ ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సుప్రిత అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె గ్లామర్ పిక్స్ మళ్లీ వైరల్ చేస్తున్నారు.

సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా ఫొటోషూట్స్ చేస్తుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే తన కూతురు సినీ ఎంట్రీ గురించి ఆ మధ్య సురేఖ మాట్లాడింది. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పింది. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో రాకముందే బాగా పాపులర్ అయిన సుప్రిత.. ఇక వెండితెరపై ఎలా అలరిస్తుందో చూడాలి.

అయితే చిట్ చాట్ లో మరిన్ని ఆసక్తికర విషయాలను కూడా సుప్రిత పంచుకుంది. తన ఏజ్ 22 అని చెప్పింది. స్టైలిష్ హెయిర్ తోపాటు స్కిన్ కేర్ సీక్రెట్ లను బయటపెట్టింది. తనకు బీచ్ లంటే చాలా ఇష్టమని తెలిపింది. వెకేషన్ కోసం థాయ్ లాండ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. లక్ష్యదీప్ కు వెళ్లి ఓ వీడియో చేయమని ఫ్యాన్ కోరగా.. అందుకు ఐడియా బాగుందని బదులిచ్చిందీ సుప్రిత.