మెగా లెగసీని ముందుకు తీసుకెళ్తున్న ఉపాసన
రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల తన కుటుంబ లెగసీని ముందుకు తీసుకెళ్తోంది.
By: Tupaki Desk | 2 May 2025 4:30 PMరామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల తన కుటుంబ లెగసీని ముందుకు తీసుకెళ్తోంది. కేవలం మెగా కోడలుగా ఉండటం మాత్రమే కాకుండా ఆ పేరుని ముందుకెలా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ ఉంటుంది ఉపాసన. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదొక అప్డేట్ ఇస్తూ ఉండే ఉపాసన తన అత్త సురేఖతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే ఇన్‌స్టంట్ ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ అత్తమ్మాస్ కిచెన్ లో రామ్ చరణ్ తల్లి సురేఖ రెడీ టు ఈట్ బ్రాండ్ ను మొదలుపెట్టి, అందులో తెలుగు సంప్రదాయ వంటకాలను ఈనాటి ట్రెండ్ కు సరిపోయేలా తయారుచేసి అందరి ప్రశంసల్ని అందుకున్నారు. అత్తమ్మాస్ కిచెన్ బ్రాండ్ ను ఉపాసన ఎంతో యాక్టివ్ గా ప్రమోట్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.
అత్తమ్మాస్ కిచెన్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ఉపాసన కొత్త అడుగు వేసింది. అందులో భాగంగా ఉపాసన ఓ ప్రత్యేక డిజిటల్ ఫీచర్ ను ఎంచుకుంది. మా వెబ్‌సైట్ ను విజిట్ చేసి ఆర్డర్ చేయడానికి అతమ్మ సైన్ పై క్లిక్ చేయండి అంటూ ఆమె రీసెంట్ గా పోస్ట్ చేసింది. క్లిక్ చేయగానే సురేఖ చేత్తో చేసిన సైన్ వచ్చేలా ఓ బ్రాండ్ ఎలిమెంట్ ను క్రియేట్ చేసింది ఉపాసన.
అయితే ఇది కేవలం ఉపాసన చేస్తున్న స్మార్ట్ మార్కెటింగ్ మాత్రమే కాదు, అత్తమ్మాస్ కిచెన్ ను ఉపాసన ఎంతో పర్సనల్ గా తీసుకుని మరీ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఉపాసన చేసిన ఈ స్మార్ట్ మూవ్ తమ మెనూలోని ప్రతీ వంటకం కేవలం రెసిపీ బుక్ లో నుంచి కాకుండా తమ వంటింట్లో నుంచే తయారవుతుందని అర్థమయ్యేలా చేసింది. ఫ్యామిలీ మెమొరీస్ ను పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ గా మార్చి ఉపాసన తనలోని వ్యాపారవేత్తను మరోసారి నిరూపించుకుంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ అందులో కొత్త ఆవకాయ తయారయ్యాక దాన్ని పూజా మందిరంలో పెట్టి లక్ష్మీ దేవి పూజ చేశారు. అత్తా కోడలు ఇద్దరూ పూజ చేసిన వీడియోను అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ సీజన్ ను మా అత్తమ్మ కొత్త ఆవకాయతో మొదలుపెట్టడంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.