TV నటి లీక్స్: భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు కానీ!
భార్యభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ, భార్య ఒక గదిలో ఉంటుంది.. భర్త మరొక గదిలో ఉంటాడు..పెళ్లయినప్పటి నుంచి ఆ ఇద్దరిదీ ఇదే తంతు
By: Tupaki Desk | 19 May 2025 10:49 PM ISTభార్యభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ, భార్య ఒక గదిలో ఉంటుంది.. భర్త మరొక గదిలో ఉంటాడు..పెళ్లయినప్పటి నుంచి ఆ ఇద్దరిదీ ఇదే తంతు. అయితే ఆలుమగల మధ్య ఏం గొడవలు ఉన్నాయో! అనుకుంటే పొరపాటే. ఆ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. ఆరాధనాభావం ఉంది. కానీ విడివిడిగా వేర్వేరు గదుల్లో ఉంటారు. దాని కారణంగా తామిద్దరం ఒకరికొకరు వ్యక్తిగత స్పేస్ ఇవ్వడానికి అవకాశం కలిగిందని బుల్లితెర నటి సురభి జ్యోతి అన్నారు.
సురభి జ్యోతి, ఆమె భర్త ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా కానీ వేర్వేరు గదుల్లో ఉంటామని చెప్పారు. ఈ జంట వారి సొంత వ్యక్తిత్వం ప్రకారం నడుచుకున్నారు. వ్యక్తిగత స్పేస్‌ని కాపాడుకోవడానికి తమ ఇంట్లో వేర్వేరు గదులలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇది అసాధారణమైనదే కానీ శ్రద్ధగా ఆలోచించి ఇలా ఏర్పాటు చేసుకున్నామని సురభి తెలిపారు.
అతడు ఇంటి నుండే పని చేస్తాడు, నేను షూటింగ్ లేనప్పుడు ఇంటి నుండే పని చేస్తాను. మేము బయటకు వెళ్లాలని తహతహలాడడం.. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంట్లో మాకు ఇష్టానుసారంగా ప్రత్యేక గదులు ఉన్నాయి. ఎందుకంటే అతడు తన జీవితంలో ఎక్కువ భాగం ఒంటరిగా జీవించాడు. నా విషయంలో కూడా అంతే. ఇది పరస్పర నిర్ణయం. ఇది చాలా అరుదు.. కానీ పాజిబుల్! అని చెప్పింది. ఎవరి స్పేస్ వారికి ఉండటం వల్ల ఇద్దరి మధ్యా బంధం మరింత బలోపేతం అయిందని సురభి అన్నారు. సొంత అల్మారా, సొంత వార్డ్ రోబ్, సొంత బాత్రూమ్ నాకు ఉన్నాయి. కొన్నిసార్లు అతడు తన సొంత గదిలో ఉంటాడు.. నేను నా గదిలో ఉంటాను. అయినా కానీ, మేము కలిసి ఉంటాము. మేము ఒకే విధంగా ఆలోచించడం కారణంగా ఇది సాధ్యమవుతోంది... అని సురభి చెప్పారు.
