Begin typing your search above and press return to search.

శోభ‌న్‌బాబు సోగ్గాడు కాదు అంత‌కు మించి..!

టాలీవుడ్‌లో వార‌సులు త‌మ లెగ‌స్సీని కంటిన్యూ చేస్తూ న‌టులుగానే కొన‌సాగ‌డం చూస్తున్నాం.

By:  Tupaki Desk   |   22 Dec 2025 10:50 AM IST
శోభ‌న్‌బాబు సోగ్గాడు కాదు అంత‌కు మించి..!
X

టాలీవుడ్‌లో వార‌సులు త‌మ లెగ‌స్సీని కంటిన్యూ చేస్తూ న‌టులుగానే కొన‌సాగ‌డం చూస్తున్నాం. కానీ కొంత మంది వార‌సులు మాత్రం డిఫ‌రెంట్ పాథ్‌ని ఎంచుకుని ఆయా రంగాల్లో టాప్‌లో నిలుస్తూ స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. ఇందులో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు నాటికి, నేటికీ సోగ్గాడు శోభ‌న్‌బాబు వార‌సుడు. వెండితెర‌పై శోభ‌న్ బాబు సోగ్గాడుగా తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకుని క్రేజ్ త‌గ్గ‌డానికి ముందే `ప‌రుగు ఆప‌డం ఓ క‌ళ‌` అన్న‌ట్టుగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు.

అయితే ఆయ‌న న‌ట‌వార‌స‌త్వాన్ని స్వీక‌రించి సినిమాల్లోకి ఆయన ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ అరంగేట్రం చేయ‌లేదు. అంతా వెల్ ఎడ్యుకేటెడ్స్ కావ‌డంతో త‌మకు న‌చ్చిన రంగాలలో సెటిఅయ్యారు. ఇక శోభ‌న్‌బాబు మ‌న‌వ‌డు సుర‌క్షిత్ డాక్ట‌ర్‌గా సేవ‌లందిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. 3డీ ల్యాప్పోస్కోపీ టెక్నాల‌జీని ఉప‌యోగించి అసాధ్యం అనుకున్న ఆప‌రేష‌న్‌ని సుసాధ్యం చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకున్నాడు.

సినిమా రంగానికి దూరంగా ఉంటున్న సుర‌క్షిత్ తాజాగా తాత శోభ‌న్‌బాబు న‌టించిన `సోగ్గాడు` రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌త్యేకంగా పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా శోభ‌న్ బాబుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 50 ఏళ్లు గ‌డిచినా ఇప్ప‌టికీ `సోగ్గాడు` మూవీ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ ఘ‌న‌త నిర్మాత సురేష్ గారిదే. అంద‌రికి మా తాత‌గారు సోగ్గాడు గానే తెలుసు కానీ నాకు మాత్రం ఆయ‌న అంత‌కు మించి. ఆయ‌న ఎంత స‌క్సెస్‌ఫుల్ అయినా, ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కి టైమ్ కేటాయించేవార‌ని తెలిపారు.

ఆయ‌న నేను ఇంత క‌ష్ట‌ప‌డ్డాను.. అంత క‌ష్ట‌ప‌డ్డాను అని ఏనాడూ అన‌లేదు. ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డ్డారో అంద‌రికి తెలుసు. సైకిల్‌పై లైఫ్ స్టార్ట్ చేసిన ఆయ‌న స్టూడియోల వ‌ద్ద‌కు సైకిల్‌పైనే తిరిగే వారు. చెన్నై వీధుల్లో ఎంత క‌ష్ట‌మైనా సైకిల్‌పై స్టూడియో.. స్టూడియో నుంచి ఇంటికి ఇంటి నుంచి స్టూడియోకి సైకిల్ పైనే తిరిగారు కానీ తాను క‌ష్ట‌ప‌డ్డాన‌ని మాత్రం ఏనాడూ చెప్పుకోలేదు. అయితే ఆయ‌న ఏ నాడూ సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ్ల‌మ‌ని ఏ ఒక్క ఫ్యామిలీ మెంబ‌ర్‌ని ఫోర్స్ చేయ‌లేదు. మీకు ఏది ఇష్ట‌మో అదే చేయ‌మ‌న్నారు. అందుకే నేను మెడిసిన్ చేశాను` అని చెప్పుకొచ్చారు సుర‌క్షిత్‌.