Begin typing your search above and press return to search.

రష్మి హాటు కేక్ అంటూ.. స్టేజ్ పైనే బోల్డ్ కామెంట్

ఇక, తెలుగు ట్రైలర్ చూశానని, అందులో రష్మి చాలా హాట్ గా కనిపించిందని, హాట్ కేకులా ఉన్నావు అంటూ రష్మి పై ప్రశంసలు కురిపించారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:03 PM GMT
రష్మి హాటు కేక్ అంటూ.. స్టేజ్ పైనే బోల్డ్ కామెంట్
X

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో తెరకెక్కించడం చాలా సహజం. ఇటీవల కన్నడలో విడుదలైన ఓ చిన్న సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి, కాసుల వర్షం కురిపించింది. అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. మొత్తం కొత్తవాళ్లతో తెరకెక్కించినా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా అయినప్పటికీ, అందరినీ మెప్పించేలా తీశారు.

దీంతో, ఇప్పుడు ఈ మూవీని తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో అందిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా కొత్తవారితో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో యాంకర్ రష్మి, తరుణ్ భాస్కర్, రిషభ్ శెట్టి లాంటివారు అతిథి పాత్రలో కనిపించనున్నారట.

కాగా, తెలుగులో ఈ మూవీని తీసుకువస్తున్నందుకు గాను, తెలుగులో నిర్మాతలుగా వ్యవహరిస్తన్న సుప్రియా యార్లగడ్డ, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలు ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ లో నిర్మాత సుప్రియ మాట్లాడారు. బాయ్ హాస్టల్స్ మూవీ కన్నడ లో చూశానని, చాలా బాగా తెరకెక్కించారని ఆయన అన్నారు.

ఇక, తెలుగు ట్రైలర్ చూశానని, అందులో రష్మి చాలా హాట్ గా కనిపించిందని, హాట్ కేకులా ఉన్నావు అంటూ రష్మి పై ప్రశంసలు కురిపించారు. సుప్రియ అమ్మాయిని కాబట్టి అలాంటి కామెంట్ చేసినా పర్వాలేదని, అదే అబ్బాయిలు చేస్తే మాత్రం ఊరుకోను అనే అర్థం వచ్చేలా రష్మి రియాక్ట్ అవ్వడం విశేషం. కాగా సుప్రియ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక, ఈ మూవీలో బాయ్స్ తమ హాస్టల్ రూమ్ లోనూ రష్మి ఫోటోలు పెట్టుకుంటారని తెలుస్తోంది.

ఇక రష్మి ఈ మూవీ గురించి మాట్లాడుతూ, తనను ఈ మూవీలో చాలా అందంగా చూపించారు అని చెప్పింది. గ్లామర్ రోల్ చేసి తాను చాలా కాలం అయ్యిందన్నారు. కన్నడలో ఎలాగైతే ఈ మూవీ హిట్ అయ్యిందో, తెలుగులోనూ అంతే సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, క్రైమ్ కామెడీ జోనరల్ లో సినిమా సాగుతుంది. సినిమా మొత్తం ఓ హాస్టల్ చుట్టూ తిరుగుతోంది.