Begin typing your search above and press return to search.

బ్లాక్ శారీలో సుప్రీత గ్లామర్ బ్లాస్ట్

తాజాగా చీరకట్టుతో దిగిన గ్లామరస్ పిక్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. బ్లాక్ శారీలో అందాలు ఆరబోసింది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 6:55 AM GMT
బ్లాక్ శారీలో సుప్రీత గ్లామర్ బ్లాస్ట్
X

హీరోయిన్లకు మించి అన్నట్లుగా ఉంది సుప్రీత తీరు. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటోంది సురేఖా వాణి డాటర్. దీంతో నిత్యం సుప్రీతకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు గానీ మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

ఫస్ట్ సినిమా చేయకముందే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది సుప్రీత. సురేఖా వాణి డాటర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. నిత్యం నెట్టింట వేడి పుట్టిస్తూ తన గ్లామర్ ఒలకబోస్తుంటుంది. అంతకుముందు మోడ్రన్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోసిన సుప్రీత.. ఇటీవలే ట్రాక్ మార్చేసింది. ఈ మధ్య ట్రెడిషనల్ లుక్స్ తో స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది.

తాజాగా చీరకట్టుతో దిగిన గ్లామరస్ పిక్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. బ్లాక్ శారీలో అందాలు ఆరబోసింది. ఆమె బ్యూటీనెస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రీత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తుంటుంది. పొట్టి దుస్తులతో యువతకు గాలం వేస్తుంటుంది. ఎంతమంది ఎలా ట్రోల్ చేసినా తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. తాజా ఫొటో షూట్స్ కు కామెంట్స్ హిడెన్ చేసి ట్రోలింగ్ కు బ్రేక్ వేసింది.

ఇటీవలే సుప్రీత ఫస్ట్ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఫస్ట్ మూవీతో సుప్రీత బోణీ కొడుతుందో లేదో చూడాలి.