Begin typing your search above and press return to search.

బీచ్ లో సూప్రితా.. హై గ్లామర్ డోస్!

టాలీవుడ్‌లో న్యూకమర్‌గా వచ్చి సోషల్ మీడియా వేదికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది సూప్రితా.

By:  Tupaki Desk   |   26 April 2025 6:00 PM IST
బీచ్ లో సూప్రితా.. హై గ్లామర్ డోస్!
X

టాలీవుడ్‌లో న్యూకమర్‌గా వచ్చి సోషల్ మీడియా వేదికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది సూప్రితా. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, డిజిటల్ ప్రాజెక్ట్స్ ద్వారా పాపులర్ అయిన ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ, సినిమాలకంటే సోషల్ మీడియాలో తన గ్లామర్ గేమ్‌తోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో మారుతోంది.

ఇటీవలే సూప్రితా తన ట్రావెల్ డైరీలో భాగంగా బీచ్ పిక్స్‌ను షేర్ చేసింది. శ్రీలంకలోని 'సీక్రెట్ బీచ్' వద్ద తీసిన ఈ ఫోటోల్లో ఆమె మరింత స్టన్నింగ్‌గా కనిపిస్తోంది. పింక్, పర్పుల్ ఫ్లోరల్ మాక్సీ డ్రెస్సులో ఆమె వేసిన స్మైల్, నేచురల్ లైట్‌షేడ్స్ ఫొటోషూట్‌కి స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. కదిలే సముద్ర అలల మధ్య ఆమె ఉన్న ఈ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

కేవలం ఫ్యాషన్‌ లుక్స్‌తో కాకుండా, సింప్ల్ హేయర్ స్టైల్, మినిమలిస్ట్ జ్యుయలరీతో సూప్రితా ఇన్‌స్టా ఫీడ్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. "హార్ట్ విత్ పీస్, స్టైల్ విత్ గ్రేస్" అనేలా ఈ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆమె కెమెరా ఫ్రెండ్లీనెస్‌కు మరోసారి మెచ్చుకోకుండా ఉండలేం. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు గ్లామరస్ క్వీన్, బీచ్ బ్యూటీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


కొందరైతే "మీ న్యాచురల్ స్మైల్‌కి ఫిదా అయ్యాం" అంటున్నారు. త్వరలో సినిమాల్లో పెద్ద బ్రేక్ వస్తే, సోషల్ మీడియా ఫాలోయింగ్ ద్వారా ఓపెనింగ్‌లోనే హైప్‌ను సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికి యాంకర్‌గా, మోడల్‌గా, డిజిటల్ క్రియేటర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకున్న సూప్రితా.. ఈ ఫోటోషూట్‌తో మరోసారి గ్లామరస్ క్వీన్ అని నిరూపించింది.