సమ్మర్ కంటే ఘాటుగా సుప్రితా గ్లామర్ డోస్
ప్రస్తుతం సుప్రితా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ వైపు బీచ్, మరోవైపు క్లియర్ స్కై బ్యాక్డ్రాప్‌లో ఆమె లుక్ నెట్టింట్లో హీట్ పెంచుతోంది.
By: Tupaki Desk | 24 April 2025 3:06 PM ISTతెలుగు ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు అందుకున్న సురేఖవాని సోషల్ మీడియాలో కూడా మంచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఆమె కూతురు సుప్రితా ఫ్యాషన్ వరల్డ్ లో డిఫరెంట్ సెలెబ్రిటీగా ఎదిగింది. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, సోషల్ మీడియా వేదికగా తన అందంతోనే కాదు, ఆత్మవిశ్వాసంతోను విభిన్నంగా నిలుస్తోంది. గ్లామర్ ఫోటో షూట్స్, బోల్డ్ స్టైల్‌తో యూత్‌లో ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇప్పుడు ఆమె లేటెస్ట్ పోస్ట్‌లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. బీచ్ పూల్‌లో విహరిస్తూ, ఒక చేతిలో కాఫీ, మరోచేతిలో కాక్‌టెయిల్‌తో సన్‌బాత్ తీసుకుంటూ కనిపించింది. గ్లామరస్ డ్రెస్సింగ్, కూల్ గాగుల్స్, నాజూకుగా ఉన్న ఆ లుక్ చూస్తే, ఫ్యాషన్ ఫోటోషూట్‌లకు పోటీగా ఉంటుంది. ఆమె స్టైల్, ఎటిట్యూడ్ కలిసి చూస్తే ఓ సినిమా పోస్టర్‌లా ఫీలవుతుంది.
ప్రస్తుతం సుప్రితా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ వైపు బీచ్, మరోవైపు క్లియర్ స్కై బ్యాక్డ్రాప్‌లో ఆమె లుక్ నెట్టింట్లో హీట్ పెంచుతోంది. ట్రెండీ టాప్ ను హైలైట్ చేస్తూ ఫోటో గ్రేస్‌ను పెంచింది. కామెంట్స్‌లో యూత్ పాజిటివ్ గా పొగిడేస్తున్నారు. 'సూపర్ గ్లామర్', 'బోల్డ్ బ్యూటీ' అంటూ కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫోటోషూట్లతో పాటు వెబ్ సిరీస్, స్మాల్ రోల్స్‌లో కనిపిస్తూ తన రేంజ్ పెంచుకుంటూ పోతోంది సుప్రితా. అయితే ఆమె ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. ముఖ్యంగా యూత్‌లో ఆమె ఇమేజ్ గ్లామర్ మాయాజాలంలా మారింది. ఈ మధ్య ఆమె షేర్ చేస్తున్న ప్రతి పోస్టు పెద్ద స్థాయిలో వైరల్ అవుతోంది. ఇక ఈ తాజా బీచ్ ఫోటోషూట్ చూస్తే, ఆమె క్రేజ్ ఎలా పెరిగిందో అర్థమవుతోంది. గ్లామర్, స్టైల్, కంఫిడెన్స్ మిక్స్ చేసిన ఆమె లుక్ అభిమానులను ముగ్ధులను చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఆమె వచ్చే ప్రాజెక్ట్స్ పైన కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
