Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సూపర్ ట్రీట్!

వేసవి కానుకగా మే9వ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల మరోసారి క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:56 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సూపర్ ట్రీట్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వేసవి కానుకగా మే9వ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అయితే మేకర్స్.. నిన్ననే ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో బ్లాక్ షూస్ తో తా టక్కరా టక్క టక్కరా బీట్ కు హీరో ప్రభాస్ కాలు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్న గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మాస్ బీట్ సాంగ్ కు ప్రభాస్ తన డ్యాన్స్ తో సందడి చేయనున్నారట. ఆయనకు జతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ చిందులేస్తుందట. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందట.

మొత్తానికి కల్కి మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ డ్యాన్స్ ట్రీట్ ఉండనుందన్నమాట. చివరగా మిర్చి మూవీలో తన డ్యాన్స్ తో అలరించారు ప్రభాస్. ఆ తర్వాత కారణాలేవైనా.. బాహుబలి-1, బాహుబలి-2, సలార్, రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ డ్యాన్స్ ను మిస్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు ఆ లోటును కల్కి మూవీతో ప్రభాస్ తీర్చనున్నారు. మాస్ డ్యాన్స్ తో అలరించనున్నారు. ప్రభాస్- దిశ సాంగ్ కు ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ అందించారట సంతోష్ నారాయణ్.

సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో కమల్ హసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. దిశా పటానీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. వైజయంతీ మూవీస్ రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది.

ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు వీఎఫ్ ఎక్స్ వర్క్స్ కూడా స్పీడ్ గా జరుగుతున్నాయట. ఎలా అయినా మే9వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలోనే మేకర్స్ మరో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్లలో స్పీడ్ కూడా పెంచనున్నారట.