Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ స్పీడ్...వేగం చూస్తే 200!

`జైల‌ర్` సక్సెస్ తో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుసగా ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jan 2024 2:45 AM GMT
సూప‌ర్ స్టార్ స్పీడ్...వేగం చూస్తే 200!
X

`జైల‌ర్` సక్సెస్ తో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుసగా ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే `లాల్ స‌లామ్` షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అలాగే ర‌జ‌నీ 170వ చిత్రం `జైభీమ్` ద‌ర్శ‌కుడు టి.జె జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. మ‌రోవైపు లోకేష్ క‌న‌గరాజ్ త‌లైవార్ తో 171వ చిత్రాన్ని తెర‌కెక్కిం చడానికి రెడీ అవుతున్నారు.

ప్ర‌స్తుతం ఆ సినిమా స్టోరీ ప‌నుల్లో లొకేష్ బిజీగా ఉన్నాడు. `ఖైదీ`..`లియో` త‌ర్వాత లొకేష్ నుంచి రాబోతు న్న చిత్రం కావ‌డం..అందులో ర‌జ‌నీ న‌టించ‌డంతో అంచ‌నాలు ప‌తాక స్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండి యాలో మ‌రో సంచ‌ల‌న చిత్ర‌మ‌వుతుంద‌న్న అంచ‌నాలున్నాయి. ఈ రెండు గాక తాజాగా సూప‌ర్ స్టార్ మ‌రో డైరెక్ట‌ర్ కి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసారు. `క‌న్న‌న్`..`మామ‌న్న‌న్` లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కె క్కించిన మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీ 172వ చిత్రం లాక్ అయింది.

ఈ విష‌యాన్ని అధికారికంగానూ ప్ర‌క‌టించారు. మారి చెప్పిన వినూత్న‌మైన క‌థ న‌చ్చ‌డంతో త‌లైవార్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఆస్టోరీ లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాల‌న్నీ ఇదే ఏడాది ప‌ట్టాలెక్కించే అవకాశం ఉంది. స‌మ్మ‌ర్ నుంచి లోకేష్ సినిమా మొద‌లువుతుంద‌ని స‌మాచారం. అటుపై ఆరు నెల‌లు గ్యాప్ అనంత‌రం 172వ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించే అవ‌కాశం ఉంది.

సూప‌ర్ స్టార్ వ‌య‌సు మీద ప‌డినా? సినిమాల జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆ మ‌ధ్య అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ స్పీడ్ త‌గ్గుతుంద‌ని భావించారంతా. కానీ స్పీడ్ త‌గ్గ‌డం కాదు అంకంత‌కు ఆయ‌న వేగం పెరుగుతుంది. వ‌య‌సుతో పాటు ఆయ‌న సినిమాల నెంబ‌ర్ కూడా పెరుగుతుంది. ఇదే స్పీడ్ లో వెళ్తే చాలా వేగంగానే 200 సినిమాల మార్క్ ని ట‌చ్ చేస్తారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.