Begin typing your search above and press return to search.

ఆ లెజండ‌రీ బ‌యోపిక్ లో సూప‌ర్ స్టార్లు అంద‌రూ!

అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా క‌మ‌ల్ అందించ‌డం విశేషం. ద‌ర్శ‌కుడితో క‌లిసి స్టోరీ వ‌ర్క్ లో కూడా పాల్గొన్నారు

By:  Tupaki Desk   |   24 March 2024 6:11 AM GMT
ఆ లెజండ‌రీ బ‌యోపిక్ లో సూప‌ర్ స్టార్లు అంద‌రూ!
X

లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజా జీవితం వెండి తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇళ‌య‌రాజా పాత్ర‌లో ధ‌నుష్ న‌టిస్తుండ‌గా..అరుణ్ మాథేశ్వ‌ర‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే సినిమా ప్రారంభోత్సం కూడా జ‌రిగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా భాగ‌మ‌వుతున్నారు. క‌మ‌ల్ నిజ జీవిత పాత్ర కూడా ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లోఉండ‌టంతో ఆ బాధ్య‌త క‌మ‌ల్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా క‌మ‌ల్ అందించ‌డం విశేషం. ద‌ర్శ‌కుడితో క‌లిసి స్టోరీ వ‌ర్క్ లో కూడా పాల్గొన్నారు. ఇళ‌య‌రాజాతో క‌మ‌ల్ హాస‌న్ కి ఉన్న అనుబంధంతోనే ఈ లీడ్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కూడా ఇందులో ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్న‌ట్లు తాజాగా లీకులందుతున్నాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో తో అయ‌న‌కున్న అనుంబంధాన్ని చూపిస్తూనే ఈ గెస్ట్ రోల్ ని డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం. అలాగే ఇంకా మ‌రికొంత మంది స్టార్లు కూడా ఈ బ‌యోపిక్ లో భాగ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇళ‌య‌రాజా దేశంలోనే గొప్ప సంగీత ద‌ర్శ‌కుడిగా పేరు గాంచారు. ఎన్నో వంద‌ల చిత్రాల‌కు సంగీతం అందించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఈ క్ర‌మంలో ఎంతో మంది ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు-హీరోల‌తో క‌లిసి ప‌నిచేసారు. ఆ మ‌జిలిలో ఎన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తులు చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్య‌మైన వాట‌న్నింటిని బ‌యోపిక్ లో చూపించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే స్టార్లు కూడా భాగ‌మ‌వ్వ‌డానికి అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

పైగా ఇలాంటి గొప్ప వ్య‌క్తి జీవిత క‌థ‌లో న‌టించాలంటే ఆ నటుడు అదృష్ట‌వంతుడై ఉండాలి. క‌మ‌ల్ హాస‌న్..ర‌జ‌నీకాంత్ ఈ అవ‌కాశాన్ని ఎంతో గొప్ప‌గా భావించి ముందుకొస్తున్నారు. మ‌రి ఈ ముగ్గురి గురించి వెండి తెర‌పై ఎంత ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తారో చూడాలి. అలాగే ఈ క‌థ‌ని ఒకే భాగంగా చెబుతున్నారా? రెండు భాగాలు చెబుతున్నారా? అన్న‌ది క్లారిటీ లేదు. క‌నెక్ట్ మీడియా-పీకే ప్రైమ్ ప్రొడ‌క్ష‌న్-మెర్క్యూరీ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.