Begin typing your search above and press return to search.

రజిని తెలివైన నిర్ణయం..!

చంద్రముఖి సీక్వెల్ పై రజిని అంత ఆసక్తి కనబరచలేదు. అంతేకాదు పార్ట్ 2 లైన్ కూడా చూచాయగా రజినికి వినిపించాడు వాసు

By:  Tupaki Desk   |   30 Sep 2023 2:45 AM GMT
రజిని తెలివైన నిర్ణయం..!
X

సూపర్ స్టార్ రజినికాంత్ ఒక పెద్ద డిజాస్టర్ మూవీ నుంచి తప్పించుకున్నారు. 18 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి కి సీక్వెల్ గా చంద్రముఖి 2 అంటూ ఓ సినిమా తెరకెక్కించారు. చంద్రముఖి తీసిన పి.వాసునే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. చంద్రముఖి సీక్వెల్ గా ఆల్రెడీ వెంకటేష్ నాగవల్లి సినిమా చేశారు. అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. అయితే అది టార్గెట్ మిస్ అయ్యింది కదా అని చంద్రముఖి 2 తో వచ్చారు.

కానీ చంద్రముఖి 2 సినిమా చూశాక ప్రేక్షకులు దీనికన్నా ఆ నాగవల్లినే కాస్త బెటర్ అనే ఫీలింగ్ కి వచ్చారు. చంద్రముఖి 2 సినిమా లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. హర్రర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లారెన్స్ చంద్రముఖి సీక్వెల్ లో నటించడం వల్ల సినిమాపై బజ్ పెరిగింది. కానీ ఈ సినిమా రజిని ఎందుకు వదులుకున్నాడు అన్నది అర్థం కాలేదు.

చంద్రముఖి సీక్వెల్ పై రజిని అంత ఆసక్తి కనబరచలేదు. అంతేకాదు పార్ట్ 2 లైన్ కూడా చూచాయగా రజినికి వినిపించాడు వాసు. ఆ టైం లోనే ఇది వర్క్ అవుట్ కాదని డిసైడ్ అయ్యి ఉంటారు రజినికాంత్. అందుకే ఆయన తెలివిగా ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పేశారు. అయితే రజిని సినిమా సీక్వెల్ కదా ఆయన వీరాభిమానిగా లారెన్స్ ఇందుకు ఓకే చెప్పాడు. చంద్రముఖి 2 సినిమా చూసిన తర్వాత లారెన్స్ మీద నెగిటివ్ ఇంప్యాక్ట్ ఏర్పడుతుంది.

అఫ్కోర్స్ డైరెక్టర్ ఏం చెబితే అది చేయడమే నటుడిగా తన పని అయినా ఇలాంటి కథలను ఎంపిక చేయడంలో కూడా తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. లారెన్స్ సెలక్షన్ పై విపరీతమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రముఖిని 2 అంటూ చంద్రముఖి సినిమానే మళ్లీ అటు తిప్పి ఇటు తిప్పు తీశాడు పి.వాసు ఎంతో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఈ సినిమాలో మెప్పించలేకపోయింది. కారణాలు ఏవైనా చంద్రముఖి 2 ని మొహమాటం లేకుండా రజిని స్కిప్ చేయడం వల్ల ఒక పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడని చెప్పుకోవచ్చు.

జైలర్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చిన రజినికాంత్ పొరపాటున ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా రిస్క్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత సూపర్ ఫాం లోకి వచ్చిన రజిని ఇక మీదట స్యూర్ షాట్ హిట్ అనుకున్న కథలనే చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.