Begin typing your search above and press return to search.

రజినీకాంత్ పై దళపతి ఫ్యాన్స్ గుస్సా

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శాకత్వంలో జైలర్ మూవీ కంప్లీట్ చేశారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:25 AM GMT
రజినీకాంత్  పై దళపతి ఫ్యాన్స్ గుస్సా
X

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శాకత్వంలో జైలర్ మూవీ కంప్లీట్ చేశారు.ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా మూవీ ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా దర్శకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయనే మాట వినిపిస్తోంది.

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ మూవీ గురించి రజినీకాంత్ ప్రస్తావించారు. ఈ దర్శకుడితో మూవీ అని ఎనౌన్స్ చేయగానే చాలా మంది డిస్టిబ్యూటర్స్ ఫోన్ చేసి తనని హెచ్చరించారు. ఆ దర్శకుడి బెస్ట్ మూవీ ఫెయిల్ అయ్యిందని, కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం లేదంటే దర్శకుడిని మార్చడం చేయాలని అన్నారు.

ఇదే విషయాన్ని బెస్ట్ నిర్మాతలైన సన్ పిక్చర్స్ వారిని అడిగాను. నెగిటివ్ రివ్యూలు వచ్చిన మాట వాస్తవమే అయినా కూడా కమర్షియల్ గా సినిమాకి లాభాలు వచ్చాయని, ఆడియన్స్ కి మూవీ బాగా రీచ్ అయ్యిందని చెప్పారు. దీంతో నెల్సన్ దిలీప్ మీద నమ్మకం పెరిగిందని అన్నారు. అయితే బీస్ట్ మూవీ ఫెయిల్యూర్ పై రజినీకాంత్ ఇలా పబ్లిక్ గా మాట్లాడి విజయ్ ని ఇన్సల్ట్ చేసారంటూ దళపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అలా అనుకుంటే బీస్ట్ కంటే రజినీకాంత్ చివరి చిత్రం అన్నాత్తై అతి పెద్ద డిజాస్టర్ గా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతలకి కూడా ఈ మూవీ భారీ నష్టాలు మిగిల్చిందని పోస్టులు పెడుతున్నారు. దాంతో పోల్చుకుంటే బీస్ట్ చాలా బెటర్ అని అంటున్నారు.

దర్శకుడి గురించి గొప్పగా చెప్పడానికి రజినీకాంత్ కి బీస్ట్ మూవీ గురించి ఇంకేం దొరకలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా రజినీకాంత్ చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ముంట పుట్టించాయి. విజయ్ వెర్సస్ రజినీకాంత్ ఫ్యాన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్స్ నడుస్తున్నాయి.