Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మూవీ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్‌

విజయ్ రాజకీయ అరంగేట్రం ముందు రాబోతున్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:44 AM GMT
సూపర్ స్టార్ మూవీ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్‌
X

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌ (ది గోట్‌) సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్ రాజకీయ అరంగేట్రం ముందు రాబోతున్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.


విభిన్నమైన కాన్సెప్ట్‌ తో దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. పాన్‌ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ది గోట్ సినిమా షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా చిత్ర నిర్మాత అర్చన కళాపతి సోషల్ మీడియా ద్వారా చిత్రం యొక్క అప్‌డేట్ ను పంచుకున్నారు.

మాస్కో లోని హిమపాతం ని షేర్ చేసిన నిర్మాత కళాపతి త్వరలోనే ది గోట్ కోసం ఇక్కడ షూటింగ్‌ జరుపబోతున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం లొకేషన్స్‌ రెక్కీ జరుగుతున్నట్లుగా కూడా ఆమె తన పోస్ట్‌ ద్వారా వెళ్లడించింది. యూనిట్‌ సభ్యులు ఇప్పటికే కొందరు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్ కి జోడీగా హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రంలో జయరామ్‌, స్నేహా, యోగిబాబు, అజ్మల్‌ అమీర్‌, మైక్ మోహన్‌, వైభవ్‌ ఇంకా ప్రముఖ నటీ నటులు నటించబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సెకండ్‌ యూనిట్‌ చిత్రీకరణ జరుపుతున్నారని, త్వరలోనే మాస్కో లో షూటింగ్‌ కు యూనిట్‌ సభ్యులతో పాటు సూపర్‌ స్టార్ విజయ్‌ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.