Begin typing your search above and press return to search.

2030 లో గౌత‌మ్ హీరోగా ఎంట్రీ?

ఆ లెక్క‌న గౌత‌మ్ హీరోగా 2030 లో లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 July 2023 12:13 PM GMT
2030 లో గౌత‌మ్ హీరోగా ఎంట్రీ?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల కుమారుడు గౌత‌మ్ ఎంట్రీ ఫిక్సైన‌ట్లేనా? ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం నుంచి మ‌రో వార‌సుడి తెరంగేట్రం లాంఛ‌న‌మేనా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే గౌత‌మ్ కి 16 ఏళ్లు నిండిన‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో గౌత‌మ్ ఫోటోలు వైర‌ల్ అవుతుంటే హీరో క‌టౌట్ అని తేలిపో యింది.

డాడ్ లాగే హీరో ఫీచ‌ర్స్ అన్ని గౌత‌మ్ లో క‌నిపిస్తున్నాయి. తాజాగా ఓ స‌మావేశంలో గౌత‌మ్ ఎంట్రీపై న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. గౌత‌మ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంద‌ని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

ఇంత‌కాలం చిన్నబాబు లా ట్రీట్ చేసిన ఇప్పుడా ఛాన్స్ లేక‌పోవ‌డంతో ఆమె కూడా అభిమానుల‌కు చెవుల‌కు వింపైన వార్త‌నే వేసార‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం గౌత‌మ్ వ‌య‌సు 16 ఏళ్లు . గ్రాడ్యూష‌న్ పూర్తిచేసే ప‌నిలో ఉన్నాడు. అత‌ని ఎంట్రీ గురించి మేము ఎలాంటి ఆలోచ‌న చేయ‌లేదు.

అప్పుడు న‌టుడ‌వ్వా ల‌నుకుంటే ఆ రంగం వైపు వ‌స్తాడు. లేక‌పోతే లేదు. ఒకవేళ హీరో అవ్వాలంటే ఇంకా ఎన్నాళ్లు ప‌ట్టొచ్చు అంటే మ‌రో ఐదారేళ్లు అన్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఆ లెక్క‌న గౌత‌మ్ హీరోగా 2030 లో లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొన‌సాగుతున్నారు. తండ్రి కి త‌గ్గ త‌న‌యుడిగా దూసుకుపోతున్నారు. రాజ‌మౌళి సినిమా త‌ర్వాత మ‌హేష్ పాన్ వ‌రల్డ్ స్టార్ అవుతార‌ని అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. ఇలా మ‌హేష్ ఎదుగుతోన్న త‌రుణంలోనే త‌న‌యుడు కూడా స్టార్ అయితే అంత‌కు మించి అభిమానుల‌కు కావాల్సింది ఏముంటుంది

అయితే గౌత‌మ్ ఇంత‌వ‌ర‌కూ త‌న ఆస‌క్తిని ఏ సంద‌ర్భంలోనూ వెల్ల‌డించ‌లేదు. సినిమా ఈవెంట్ల‌లో పాల్గొన‌డం కూడా త‌క్కువే. సినిమాల‌కు దూరంగా ఉంచి స్ట‌డీస్ పై ఏకాగ్ర‌త చూపాల‌నే త‌ల్లిదండ్రులు సినిమాల‌కు దూరంగా పెట్టారు. 'వ‌న్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా క‌నిపించిన గౌత‌మ్ మ‌ళ్లీ ఏ సినిమాలో న‌టించ‌ని సంగ‌తి తెలిసిందే.