Begin typing your search above and press return to search.

మ‌హేష్ అనాస‌క్తి ..అల్లుడు మాత్రం అద‌ర‌గొడ‌తాడుట‌

సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ లో న‌టిస్తారా? నాన్నగారి జీవితాన్ని ఎప్పుడు వెండి తెర‌కు ఎక్కిస్తారు? అంటే త‌న‌యుడు మ‌హేష్ నుంచి వ‌చ్చిన ఒక‌టే స‌మాధానం

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:28 AM GMT
మ‌హేష్ అనాస‌క్తి ..అల్లుడు మాత్రం అద‌ర‌గొడ‌తాడుట‌
X

సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ లో న‌టిస్తారా? నాన్నగారి జీవితాన్ని ఎప్పుడు వెండి తెర‌కు ఎక్కిస్తారు? అంటే త‌న‌యుడు మ‌హేష్ నుంచి వ‌చ్చిన ఒక‌టే స‌మాధానం. అంత రిస్క్ తాను తీసుకోనని. అవును ఓ సంద‌ర్భంలో నాన్న గారి బ‌యోపిక్ లో న‌టిస్తారా? మ‌హేష్ త‌న దేవుడి జీవితంలో న‌టించ‌డం అన్న‌ది అంత సుల‌భంగా జ‌రిగే ప‌ని కాద‌ని వ్యాఖ్యానించారు. మ‌హేష్ తండ్రి పాత్ర‌కి అన్ని ర‌కాలు అర్హుడే అయినా ఆ ఛాన్స్ తాను తీసుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయ‌న‌ట్లు చెప్పుకొచ్చారు.

కృష్ణ బ‌యోపిక్ తెర‌కెక్కాల‌న్నా! మ‌హేష్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంది. అందులో ఆయ‌న కాక‌పోతే ఎవ‌రు న‌టించాలి అన్న‌ది కూడా నిర్ణ‌యించేది మ‌హేష్ మాత్ర‌మే. తండ్రి జీవిత క‌థ‌పై పూర్తి హ‌క్కులు ఆయ‌న‌కు సొంతం కాబ‌ట్టి! నిర్ణ‌యం అనేది ఆయ‌న చేతుల్లోనే ఉంది. ప్రేక్ష‌కాభిమానులు సూప‌ర్ స్టార్ జీవితంలో కేవ‌లం మ‌హేష్ ని మాత్ర‌మే ఓన్ చేసుకుంటున్నారు అన్న‌ది వాస్త‌వం. ఆయ‌న త‌ప్ప మ‌రో న‌టుడి ఆ పాత్ర‌కి ప‌రిపూర్ణం కాద‌న్న‌ది అభిమానుల నుంచి వ‌స్తోన్న అభిప్రాయం.

ఈ నేప‌థ్యంలో తాజాగా కృష్ణ బ‌యోపిక్ లో నేను న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నానంటూ అల్లుడు సుదీర్ బాబు ముందుకు రావ‌డం విశేషం. కృష్ణ బ‌యోప‌నిక్ లో న‌టించే అవ‌కాశం వ‌స్తే అద‌ర‌గొడ‌తా అంటు న్నాడు. 'సూప‌ర్ స్టార్ బ‌యోపిక్ చేస్తే నా కెరీర్ కి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నో... లేదంటే ఆయ‌న మామ‌గార‌నే ఆస‌క్తి చూపించ‌డం లేదు. బ‌యోపిక్ చేస్తున్న‌ప్పుడు ఆ పాత్ర తాలుకా ఆత్మ‌ని ప‌ట్టుకోవ‌డం ముఖ్యం. కృష్ణ‌గారు వ్య‌క్తిగ‌తంగా తెలుసు.

ఆయ‌న జీవితంలో ఎత్తు ప‌ల్లాలు..సంఘ‌ర్ణ‌ణ ద‌గ్గ‌రుండి చూసిన వాడిని. బ‌యోపిక్ అంటే వాళ్ల‌లా న‌టిస్తేనో..హ‌వ‌బావాలు ప్ర‌ద‌ర్శిస్తేనో స‌రిపోదు. సినిమాక‌ది కేవ‌లం అలంక‌ర‌ణ మాత్ర‌మే. కావాల్సింది కేవ‌లం ఆత్మ మాత్ర‌మే. అందుకే కృష్ణ‌గారి బ‌యోపిక్ అవ‌కాశం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.