Begin typing your search above and press return to search.

విలన్‌ గా సూపర్‌ స్టార్‌...!

బాలీవుడ్‌ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణబీర్ కపూర్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:22 AM GMT
విలన్‌ గా సూపర్‌ స్టార్‌...!
X

యానిమల్‌ సినిమా తో చాలా కాలం తర్వాత భారీ బ్లాక్‌ బస్టర్ దక్కించుకున్న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రణబీర్‌ కపూర్‌ ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేస్తున్నాడు. ఆలియా భట్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

భారీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ఒక వైపు యుద్ధం మరో వైపు రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణబీర్ కపూర్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట.

గ్రే షేడ్‌ పాత్ర అవ్వడంతో అద్భుతమైన నటనకు స్కోప్ ఉంటుందట. తద్వారా ఈ సినిమా తో కచ్చితంగా రణబీర్ కపూర్ మరోసారి నటుడిగా తనను తాను నిరూపించుకోవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాను 2025 క్రిస్మస్‌ వరకు రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

సావరియా సినిమాతో రణబీర్‌ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ హిట్ కొట్టారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా రాబోతుంది. విక్కీ కౌశల్ ఈ మధ్య కాలంలో వరుసగా హిట్స్ దక్కించుకుంటున్నాడు. దాంతో ఈ సినిమా ఆయనకు మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయంగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.