Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!

కొన్ని సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ లో జాతీయ స్థాయిలో ఆధరణ దక్కించుకోలేక పోయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత పాన్‌ ఇండియా మూవీగా నిలుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 March 2024 12:30 AM GMT
సూపర్‌ హిట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!
X

ఇటీవల మలయాళంలో రూపొందిన సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ లో జాతీయ స్థాయిలో ఆధరణ దక్కించుకోలేక పోయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత పాన్‌ ఇండియా మూవీగా నిలుస్తున్నాయి.

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్‌ హిట్‌ మూవీ 'అబ్రహం ఓజ్లర్‌'. ఈ సినిమాలో జయరామ్‌ టైటిల్‌ పాత్రను పోషించారు. ఇంకా అనశ్వర రాజన్‌, అనూప్‌ మీనన్‌, అర్జున్ అశోక్‌, ఆర్య సలీం, సెంథిల్‌ కృష్ణ తదితరులు సహాయ పాత్రల్లో కనిపించారు.

ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించాడు. ఆయన పాత్ర తో సినిమా మరో లెవల్‌ కి వెళ్లింది. వరుస హత్య కేసుల ఎంక్వౌరీకి సంబంధించిన కథతో ఈ సినిమాను మిథున్‌ మాన్యూవల్‌ థామస్‌ రూపొందించాడు.

ఈ ఏడాది జనవరిలో 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అబ్రహం ఓజ్లర్‌ ను అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ వారాలు గడుస్తున్న కొద్ది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకు పోయింది. దాదాపుగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం మలయాళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మార్చి 20న ఈ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది.