Begin typing your search above and press return to search.

హనుతో ప్రభాస్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?

ముందు వరుసలో అలియా భట్ ఉందని టాక్. ఆమె కాకపోతే జాన్వి కపూర్ కి ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:05 PM GMT
హనుతో ప్రభాస్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?
X

సీతారామం తర్వాత హను రాఘవపూడి తన నెక్స్ట్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తాడని టాక్. హను ప్రభాస్ అంటే ఈ సినిమా కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న కల్కి, రాజా సాబ్ తర్వాత స్పిరిట్ చేయాల్సి ఉంది. దానితో పాటు సలార్ 2 కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. సలార్ 2 తో పాటుగా హను రాఘవపూడి సినిమా కూడా షూటింగ్ చేసే ప్లానింగ్ చేస్తున్నాడట ప్రభాస్.

ఈ సినిమా కూడా సెకండ్ వరల్డ్ వార్ టైం బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. ప్రేమ కథలను తీయడంలో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న హను సీతారామం హిట్ తర్వాత తన మీద తనకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాను అనుకున్నా దాని కన్నా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ ఆల్రెడీ రాధే శ్యాం అంటూ లవ్ స్టోరీనే చేశాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమా రిజల్ట్ ని దృష్టిలో ఉంచుకుని హను సినిమాను జాగ్రత్తగా చేయాలని అనుకుంటున్నారట. అయితే లవ్ స్టోరీ అది కూడా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ అనగానే సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది ఇంకా నిర్ణయించలేదు. సినిమాలో కచ్చితంగా బాలీవుడ్ భామల్లో ఒకరు నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ముందు వరుసలో అలియా భట్ ఉందని టాక్. ఆమె కాకపోతే జాన్వి కపూర్ కి ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే సినిమాలో హీరోయిన్ ఒకవేళ ఫారిన్ అమ్మాయి అయితే మాత్రం కచ్చితంగా హాలీవుడ్ భామనే హను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. సో కాస్టింగ్ తోనే హను ప్రభాస్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ సినిమాల లైనప్ లో క్రేజీ గా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమా తప్పకుండా రెబల్ ఫ్యాన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. ప్రభాస్ రేంజ్ కి తగినట్టుగానే బడ్జెట్ సినిమా సెటప్ ఉంటుందని తెలుస్తుంది.