Begin typing your search above and press return to search.

వాళ్ల‌కు 99 అయితే ఈయ‌న‌కు 35!

చిత్రానికి ర‌వి అర‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దుషార విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వం చెన్నైలో ప్రారంభ‌మైంది.

By:  Tupaki Desk   |   15 July 2025 8:00 PM IST
వాళ్ల‌కు 99 అయితే ఈయ‌న‌కు 35!
X

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ పిల్మ్స్ గురించి ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో చిత్రాల‌ను నిర్మించింది. ఎంతో మందిని ద‌ర్శ‌కులుగా, టెక్నిషీయ‌న్ల‌గా ప‌రిచ‌యం చేసిన ఘ‌త‌న సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ సొంతం. నిర్మాణ రంగంలో మూడున్న‌ర ద‌శాబ్దాలుగా రాణిస్తోంది. తొలి చిత్రం మాలీవుడ్ లో నిర్మించింది. అటుపై త‌మిళ్ లో కి అడుగు పెట్టింది. ఎక్కువ‌గా కోలీవుడ్లో నే సినిమాలు నిర్మించింది.

తెలుగులో `కెప్టెన్`, `సుస్వాగ‌తం`, `నేను ప్రేమిస్తున్నాను`, `రాజా` , `నేటి గాంధీ` ,` శీను`, `నవ్వొస్తావ‌ని` , `నిన్నే ప్రేమిస్తా`, `సింహ‌రాశి`, `శివ‌రామరాజు` ఇలా ఎన్నో విజ‌యంవ‌త‌మైన చిత్రాల‌ను నిర్మిం చింది. నిర్మాణ రంగ‌లో సూప‌ర్ గుడ్ పిల్మ్స్ ఎన్నో గొప్ప విజ‌యాల‌ను సాధించింది. ఎంతో మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 98 సినిమాల‌ను నిర్మించింది. 99వ చిత్రం విశాల్ హీరోగా తాజాగా నిర్మిస్తుంది.

ఈ చిత్రానికి ర‌వి అర‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దుషార విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వం చెన్నైలో ప్రారంభ‌మైంది. అయితే ఈసినిమా షూటింగ్ ను కేవ‌లం 45 రోజుల్లోనే పూర్తి చేస్తామ‌ని సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ స‌వాల్ చేసింది. సినిమా షూటింగ్ లో బాగా ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో త‌మ సినిమాను మాత్రం ఇన్ టైమ్ లోనే పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తా మ‌న్నారు. ఇంత వ‌ర‌కూ సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఏ సినిమా షూటింగ్ 45 రోజుల్లో పూర్తి కాలేదు.

చాలా సినిమాల‌కు రెండు నెల‌ల‌కు పైగానే స‌మ‌యం ప‌ట్టింది. ఈ నేప‌త్యంలో వంద సినిమాల‌కు చేరు వ‌వుతోన్న నేప‌థ్యంలో సంస్థ పేరిట ఇదో రికార్డులా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి 100వ చిత్రాన్ని ఇంకెంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తారో చూడాలి. ఈ సినిమా విశాల్ కు 35వ చిత్రం కావ‌డం విశేషం. గ‌తంలో ఇదే సంస్థ‌లో విశాల్ కొన్ని సినిమాలు చేసాడు. అవ‌న్నీ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్లే. ఈ సంస్థ తో విశాల్ కు ఎంతో అనుబంధం ఉంది. ఈనేప‌థ్యంలో విశాల్ 35వ సినిమాకు ఆర్ . బి. చౌద‌రి నిర్మాత‌గా మారుతున్నారు. ఈ చిత్రానికి జీవి. ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.