Begin typing your search above and press return to search.

ఆ సంస్థ‌లో 100వ చిత్రం తెలుగు హీరోతోనా!

ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ ప్ర‌స్తానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మిళ్, తెలుగు, మ‌లయాళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు నిర్మించింది.

By:  Tupaki Desk   |   17 July 2025 8:00 AM IST
ఆ సంస్థ‌లో 100వ చిత్రం తెలుగు హీరోతోనా!
X

ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ ప్ర‌స్తానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మిళ్, తెలుగు, మ‌లయాళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు నిర్మించింది. ప్రముఖంగా త‌మిళ సినిమాలు ఎక్కువ‌గా ఆ త‌ర్వా త తెలుగు సినిమాలు నిర్మించింది. స‌ద‌రు సంస్థ ద్వారా ఎంతో మంది న‌టులు, టెక్నీషియ‌న్లు ప‌రిచ‌య మ‌య్యారు. నేడు సూప‌ర్ స్టార్ల‌గా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం 99వ చిత్రం విశాల్ హీరోగా నిర్మిస్తున్నారు. మ‌రి ల్యాండ్ మార్క్ చిత్రం 100వ సినిమా ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారంటే భారీ ప్ర‌ణాళికే క‌నిపిస్తుంది.

ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో నిర్మించాల‌ని సంద‌రు సంస్థ భావిస్తుందిట‌. అదీ పాన్ ఇండియా లో రిలీజ్ చేయాల‌న్న‌ది ఆలోచ‌న‌గా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత వ‌ర‌కూ ఈ సంస్థ నుంచి ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేదు. తెలుగు, త‌మిళ ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేసారు. ఇంకా అవసరం అన‌కుంటే మ‌ల‌యాళం, క‌న్న‌డ వ‌ర‌కూ వెళ్లారు. బాలీవుడ్ ని మాత్రం ట‌చ్ చేయ‌లేదు. అస‌లు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా నిర్మించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో 100వ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నారుట‌. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఇలాంటి ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా అంటే అంద‌రికీ గుర్తొచ్చేది తెలుగు హీరోలే. ఈనేప‌థ్యంలో తెలుగు హీరోతోనే రెండు భాష‌ల్లో చిత్రాన్ని ప్లాన్ చేస్తు న్న‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఈసంస్థ‌లో న‌టించే ఛాన్స్ ఏ హీరోకి ద‌క్కుతుందో చూడాలి. ఈ సినిమానే సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం కూడా అవుతుంది.

సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగులో చివ‌రిగా చిరంజీవి హీరోగా న‌టించిన `గాడ్ ఫాద‌ర్` నిర్మాణంలో భాగ మైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినిమాలో నిర్మించ‌లేదు. ప్ర‌స్తుతం త‌మిళం, మ‌ల‌యాళంలోనే సిని మాలు నిర్మిస్తుంది. అలాగే ఈ సంస్థ పంపిణీ రంగంలోనూ ముందున్న సంగ‌తి తెలిసిందే.