Begin typing your search above and press return to search.

సన్నీ లియోన్ భయం భయం..!

భయం భయంగా గ్రిల్స్ పై నడిచిన సన్నీ లియోన్‌ చివరకు సాధించాను అంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:04 AM GMT
సన్నీ లియోన్ భయం భయం..!
X

ఇండియన్ సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా సోషల్‌ మీడియా రెగ్యులర్‌ గా ఫాలో అయ్యే వారికి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాలతో పాటు అప్పుడప్పడు సౌత్ లో కూడా మెరుస్తున్నముద్దుగుమ్మ సన్నీ లియోన్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వైరల్‌ అవుతూనే ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. షర్ట్‌ ధరించి ఉన్న సన్నీ లియోన్‌ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నడుస్తున్న వీడియోను షేర్ చేసింది. గ్రిల్స్ పై భయం భయంగా నడుస్తున్న సన్నీ లియోన్‌ వీడియో ని నెటిజన్స్‌ తెగ చూస్తున్నారు.

భయం భయంగా గ్రిల్స్ పై నడిచిన సన్నీ లియోన్‌ చివరకు సాధించాను అంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త భయం వేసింది కానీ చివరకు మొత్తం దాటిన తర్వాత చాలా ఆనందం కలిగిందని చెప్పుకొచ్చింది.

సాధారణంగా సన్నీ లియోన్‌ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసిన సమయంలో లక్షల్లో వ్యూస్ మరియు లైక్స్ వస్తాయి. అయితే ఎలాంటి స్కిన్‌ షో లేకున్నా కూడా ఈ వీడియోను వీడియో ను లక్షల్లో చూశారు, అంతే కాకుండా దాదాపు రెండు లక్షల మంది లైక్ చేసి షేర్‌ చేశారు.

ఇక సన్నీ లియోన్‌ సినిమాల విషయానికి వస్తే వరుసగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే ఉంది. మరో వైపు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సన్నీ ఈ మధ్య కాలంలో సినిమాల్లో పాత్రలు చేస్తుంది.