Begin typing your search above and press return to search.

స‌న్ని లియోన్ పాన్ ఇండియా సుంద‌రి!

ఆమెని మెయిన్ లీడ్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమానే భారీ బ‌డ్జెట్ తో తీసారంటే? ఇక్క‌డెంత ఫేమ‌స్ అయింద‌న్న‌ది అద్దం భావించొచ్చు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 5:48 AM GMT
స‌న్ని లియోన్ పాన్ ఇండియా సుంద‌రి!
X

స‌న్నిలియోన్ సౌత్..నార్త్ రెండు భాష‌ల్లోనూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్ల పాటు హిందీ లోనే ఎక్కువ సినిమాలు చేసిన అమ్మ‌డు త‌న మార్క్ అక్క‌డికే ప‌రిమిత‌మైతే ఎలా? అని భావించిన స‌న్ని సౌత్ లోనే స‌త్తా చాటే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. అప్ప‌టి నుంచి రెండు భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందు కుంటుంది. తెలుగులో రెండు..మూడు సినిమ‌లే చేసినా మంచు ఫ్యామిలీతో మంచి రిలేష‌న్ షిప్ ని క‌లిగి ఉండ‌టంతో? ఇక్క‌డా బాగా ఫేమ‌స్ అయింది.

ఆ మ‌ధ్య విష్ణుతో క‌లిసి కొన్ని ఫ‌న్సీ షోస్ చేసిన అమ్మ‌డు అప్ప‌టి నుంచి తెలుగు ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయింది. అలాగే మల‌యాళం...క‌న్న‌డ భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందుకుని స‌త్తా చాటుతుంది. ఆమెని మెయిన్ లీడ్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమానే భారీ బ‌డ్జెట్ తో తీసారంటే? ఇక్క‌డెంత ఫేమ‌స్ అయింద‌న్న‌ది అద్దం భావించొచ్చు. తాజాగా మాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈసిరీస్ ని 'పాన్ ఇండియా సుంద‌రి' టైటిల్ తో స‌తీశ్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. టైటిల్ లో నే స‌న్నిలియోన్ పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ టైటిల్ కి స‌న్ని ప‌క్కాగా నూరుశాతం యాప్ట్ అవుతుంది. పాన్ ఇండియా అన్ని భాష‌ల్లో బాగా తెలిసిన న‌టి అయి ఉండాలి. స‌న్నికి ఇండియాలోనే కాదు అంత‌ర్జాతీయంగానూ ఉంతో పాపులారిటీ సంపాదించిన న‌టి. స‌న్నిలియో న్ బాలీవుడ్ కి రాక‌ముందు శృంగార తార‌గ విశ్వ‌వ్యాప్త‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడా క్రేజ్ ని ఇండియాన్ ఓన్ క్యాష్ చేసుకునేందుకు పాన్ ఇండియా సుంద‌రి అంటూ వెబ్ సిరీస్ ని ప్ర‌క‌టించారు. మాస్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉంటుంది. ఇందులో శ్రీకాంత్ మాళ‌విక‌..అప్ప‌ని శ‌ర‌త్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. తెలుగు.. త‌మిళ ..హిందీ ..మ‌లయాళ‌..క‌న్న‌డ భాష‌ల్లో దీన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.