Begin typing your search above and press return to search.

స‌న్నీలియోన్ టోటల్ ధ‌మాకా ఫ్యామిలీ ఫ్రేమ్

ఎంత మనోహరమైన రోజు! అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు! అంటూ వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి జోడించింది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 3:59 PM GMT
స‌న్నీలియోన్ టోటల్ ధ‌మాకా ఫ్యామిలీ ఫ్రేమ్
X

ఒకరోజు ముందే ముంబైలోని ఎయిర్‌పోర్టు నుంచి సన్నీలియోన్‌ బయటికి వస్తుండగా స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు ఆమెను చుట్టుముట్టారు. కెమెరా ఫ్లాష్ ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసారు. దానికి కార‌ణం స‌న్నీ అల్ట్రా స్టైలిష్ లుక్. ప్ర‌తిసారీ మోడ్ర‌న్ ప్ర‌పంచపు ఫ్యాష‌న్ సెన్స్ ని అనుక‌రించే స‌న్నీలియోన్ ఇప్పుడు రాఖీ పండ‌గ రోజు పూర్తి ఫ్యామిలీ కోసం త‌న‌ స‌మ‌యాన్ని వెచ్చించింది.


అంతేకాదు.. ఈసారి పండ‌గ సాంప్ర‌దాయానికి త‌గ్గ‌ట్టు ఎంతో ప‌ద్ధ‌తైన పంజాబీ డ్రెస్ లో ప్ర‌త్యక్ష‌మైంది. ఈ ఫ్రేమ్ లో టోట‌ల్ స‌న్నీలియోన్ కుటుంబం క‌నిపించింది. త‌న‌కు స‌రోగ‌సీ ద్వారా జ‌న్మించిన పిల్ల‌లు, ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌తో పాటు భ‌ర్త‌ డేనియ‌ల్ వెబ‌ర్ ఈ ఫ్రేమ్ లో ఉన్నాడు. ఎంత మనోహరమైన రోజు! అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు! అంటూ వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి జోడించింది. యూస‌ఫ్ - ఐషా -క‌లీభ్‌-అనీషా ధీక్షిత్- స‌న్నీ ర‌జ‌ని-జీతి నిషా- అషీర్- నోహ్ .. అంటూ ఈ ఫ్రేమ్ లో ఉన్న బృందం గురించి వివ‌రాలు అందించింది స‌న్నీ.

స‌న్నీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి 'కొటేషన్ గ్యాంగ్' అనే చిత్రంలో కనిపిస్తుంది. ఈ సినిమాతో పాటు ప‌లు రియాలిటీ షోల‌తోను స‌న్నీ బిజీగా ఉంది. మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌పైనా దృష్టి సారించింద‌ని స‌మాచారం. ఇంత‌కుముందు పాన్ ఇండియా మూవీ 'రాణి మాదేవిని' చిత్రాన్ని ఘ‌నంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఎవ‌రికీ తెలియ‌దు. ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న చేసినా కానీ బ‌డ్జెట్ల ప‌రంగా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో మ‌ధ్య‌లోనే నిలిచిపోయింద‌ని టాక్ వినిపించింది.

అమీర్ ఖాన్‌తో ఆఫ‌ర్?

ఇటీవల జాతీయ టీవీలో సన్నీ లియోన్ చాటింగ్ సెష‌న్ అంత‌టా వైర‌ల్ అయింది. టీవీ చానెల్ లైవ్ లో ఇంట‌ర్వ్యూవ‌ర్ ప్ర‌శ్నిస్తూ.. బాలీవుడ్ ఎ-లిస్టర్ అమీర్ ఖాన్ తో ఎప్పుడైనా పని చేస్తారా? అని ప్ర‌శ్నించ‌గా...చెప్ప‌లేం.. అమీర్ బహుశా నాలాంటి వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడడు! అని స‌న్నీ నిక్కచ్చిగా బదులిచ్చింది. లూథియానాలో తన రెజ్లర్ బయోపిక్ 'దంగల్' చిత్రీకరణలో ఉన్నప్పుడు ప్రో కబడ్డీ జాతీయ గీతం ప్ర‌మోష‌న్స్ కోసం అమీర్ ఖాన్ మద్దతు ఇచ్చాడ‌ని స‌న్నీ తెలిపారు.

ఆ స‌మ‌యంలో మీ గతంతో నాకు ఎటువంటి సమస్యలు లేవు అని అమీర్ అన్నాడు. గత 10 రోజులుగా ఢిల్లీలో షూటింగ్‌లో ఉన్న అమీర్ ఖాన్.. స‌న్నీలియోన్ ని విందుకు ఆహ్వానించాడు. సన్నీ ప్రమోషనల్ ఈవెంట్ కోసం నగరంలో ఉన్నారని తెలియగానే అమీర్ ఖాన్ స‌న్నీలియోన్ ని ఆమె భర్త డేనియల్ వెబర్‌ను తన హోటల్‌కి ఆహ్వానించార‌ట‌. నాన్స్ సబ్జీతో కూడిన విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేసాడు. ఆ మరుసటి రోజు సెట్స్‌లో తనను సందర్శించమని అమీర్ వారికి ఆహ్వానం పంపాడు! అని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ఈ ముగ్గురూ సినిమాల గురించి ముచ్చ‌టించారు. ఈ స‌మావేశం స‌మ‌యంలోనే స‌న్నీలియోన్ తో క‌లిసి ప‌ని చేయ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తాన‌ని అమీర్ అన్నారు. ప్రోక‌బ‌డ్డీ ప్ర‌చార వీడియోలో స‌న్నీతో క‌లిసి న‌టించాడు. నిజానికి అమీర్ ఖాన్ కెమెరా ముందు న‌ట‌న కోసం రెడీ అవుతుంటే స‌న్నీ కళ్ళు పెద్దవి చేసి చూసింది. అనంతరం ఆమెను యూనిట్‌కి పరిచయం చేశాడు. స‌న్నీ ప్రతి ఒక్కరినీ సెల్ఫీలతో కట్టిపడేసింది. వెళ్లేటప్పుడు అమీర్ ని వెచ్చగా కౌగిలించుకుంది! అని సోర్స్ వెల్ల‌డించింది. అయితే అమీర్ ఖాన్ న‌టించే ఏ సినిమాలోను స‌న్నీలియోన్ కి ఆఫ‌ర్ అయితే ఇవ్వ‌లేదు.